ఉత్పత్తి నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం
By Sakshi

న్యూఢిల్లీ: ఆకర్షణీయంగా కనిపించే వెబ్సైట్, ఆధునికతను ఒలకబోసే మొబైల్ యాప్... ఆన్లైన్ షాపర్లను ఆకర్షించేవి ఇవి కావట. ఫీజుల విషయంలో పారదర్శకత, డెలివరీపై నియంత్రణ, స్పష్టతతో కూడిన రిటర్న్ పాలసీ, లాయల్టీ రివార్డులు వీటికి ఆన్లైన్ షాపర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు యూపీఎస్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ షాపర్స్ పల్స్ అధ్యయనంలో తెలిసింది. ఆన్లైన్ రిటైలర్లకు తదుపరి హద్దులు ఇవేనని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. అమెరికా, ఆసియా, యూరోప్, కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తోపాటు మొదటిసారి భారత్‌లోనూ ఆన్లైన్ షాపర్ల ప్రాధాన్యతలు, కొత్త ధోరణలు, వారి అంచనాలను తెలుసుకునేందుకు యూపీఎస్ ఈ సర్వే నిర్వహించింది. మన దేశంలో నాణ్యతకు ఆన్లైన్ షాపర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. అలాగే, ఉత్పత్తులను తిరిగి పంపడంలోనూ, వాయిస్ ఫిర్యాదులు విషయంలోనూ చురుగ్గా ఉంటున్నారు. నాణ్యత దృష్ట్యానే మన దేశంలో 66 శాతం మంది అంతర్జాతీయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీని తర్వాత డెలివరీ కాస్ట్‌ను చూసే వారు 41 శాతం మంది ఉన్నారు. డెలివరీ ఎంత వేగంగా చేస్తారన్నది 39 శాతం మందికి ముఖ్యం కాగా, అంతర్జాతీయ విక్రేతల విశ్వసనీయత చూసే వారు 39 శాతం ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో 68 శాతం మంది ఉత్పత్తి నచ్చక రిటర్న్ చేస్తున్నారు. రిటైలర్లపై ఫిర్యాదులు చేసే వారు అంతర్జాతీయంగా 30 శాతంగా ఉంటే, మన దేశంలో ఇది 53 శాతంగా ఉన్నట్టు ఈ సర్వేలో తెలిసింది.
You may be interested
హైదరాబాద్‌లో బ్రిటన్ టెక్నాలజీ హబ్
Thursday 8th August 2019దేశవ్యాప్తంగా నాలుగు ఏర్పాటు బ్రిటన్ హై కమిషనర్ సర్ డొమినిక్ వెల్లడి చెన్నై: భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు, ఇరు దేశాల్లోను పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ సర్ డొమినిక్ ఆస్కిత్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో నాలుగు భారతీయ నగరాల్లో టెక్ హబ్‌లు (టెక్నాలజీ హబ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో వీటిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. రెండు
హైదరాబాద్‌లో నోబ్రోకర్.కామ్ సేవలు
Thursday 8th August 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- రియల్ ఎస్టేట్ పోర్టల్ నోబ్రోకర్.కామ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. కస్టమర్ నుంచి కస్టమర్‌కు సేవలందిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే అయిదు నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అద్దె, కొనుగోలు, విక్రయానికి ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్‌ను ఈ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎటువంటి బ్రోకరేజ్ వసూలు చేయబోమని కంపెనీ ఫౌండర్, సీబీవో సౌరభ్ గర్గ్ తెలిపారు. ఫౌండర్, సీటీవో అఖిల్ గుప్తాతో కలిసి బుధవారమిక్కడ