News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తొలి ఛార్జీసీటు నమోదు

Saturday 17th August 2019
news_main1566040132.png-27838

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తొలి ఛార్జీషీట్‌ను నమోదు చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం చార్జిషీట్ దాఖలైనట్లు అధికారులు ధృవీకరించారు. నిధుల సంక్షోభానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్లతో పాటు ఇతరుల పాత్ర మేరకు ఉందనే అంశాన్ని ఛార్జ్‌షీట్‌ తెలియజేస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బ్యాంకు ఖాతాలతో పాటు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బ్రసెల్‌, బెల్జియం దేశాల్లోని స్థిరాస్థుల అటాచ్‌మెంట్‌కు ఈడీ తాత్కలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.570కోట్ల విలువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సాహా, కరుణాకర్‌న్‌లను ఈడీ జూన్‌లో అరెస్ట్‌ చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై పడగా, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించాల్సి వచ్చింది.
 



You may be interested

ఆరు స్టాక్స్‌లో ఫండ్స్ భారీ పెట్టుబడులు

Sunday 18th August 2019

జూలై నుంచి మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం తెలిసిందే. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ (మ్యూచువల్‌ పండ్స్‌, బీమా సం‍స్థలు) కొనుగోళ్లు మార్కెట్లను కొంత వరకైనా ఆదుకున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ముఖ్యంగా నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం.    ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకరాం... జూలైలో లార్జ్‌క్యాప్‌, ఫోకస్డ్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ పథకాల్లోకి రూ.6,000 కోట్ల

మార్కెట్‌ నుంచి 20 శాతం రాబడులు పొందొచ్చు

Saturday 17th August 2019

‘పన్నులు, జీఎస్‌టీ, వడ్డీ రేట్లను తగ్గించడం, నిర్మాణాత్మక సంస్కరణలను ప్రభుత్వం తీసుకు రావడం వంటివి జరిగి,  ప్రపంచఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారితే దేశియ మార్కెట్‌ 15-20 శాతం రిటర్న్‌లను ఇవ్వగలదు’ అని మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్టర్, సీఐఓ మిహిర్ వోరా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. మార్కెట్‌ను నడిపింది..కొన్ని స్టాకులే! గత ఏడాది నుంచి గమనిస్తే నిప్టీ, ఎస్‌ అండ్‌ పీ సెన్సెక్స్‌ను నడిపించినవి కేవలం

Most from this category