News


ఫిన్‌టెక్‌ కంపెనీల ‘కంటెంట్‌’ మంత్రం

Wednesday 21st August 2019
news_main1566362666.png-27909

  • స్టాక్‌ మార్కెట్లు, ఫండ్స్‌పై విస్తృత సమాచారం
  • చార్ట్‌లు, గ్రాఫ్‌లు, వీడియో, టెక్ట్స్‌ సందేశాలు
  • అస్థిరతల సమయాల్లో నడుచుకోవడంపై అవగాహన
  • పెట్టుబడుల అవకాశాల పట్ల సూచనలు
  • తద్వారా ఇన్వెస్టర్లు దూరం కాకుండా చర్యలు

న్యూఢిల్లీ: స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల సేవలు అందిస్తున్న నవతరం ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు.. అల్లకల్లోల సమయాల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు, వారు మార్కెట్లకు దూరంగా వెళ్లకుండా ఉండేందుకు పలు రకాల సేవలతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన కంటెంట్‌ కూడా ఒకటి. స్టాక్‌ మార్కెట్లు దీర్ఘకాలంగా తీవ్ర అస్థిరతల్లో ఉండడంతో కంపెనీలు ఈ తరహా చర్యల దిశగా అడుగులు వేస్తున్నాయి. జెరోదా, గ్రోవ్‌ వంటి సంస్థలు బ్లాగ్‌ పోస్ట్‌లు, సోషల్‌ మీడియా సందేశాలు, మార్కెట్లపై విజ్ఞానాన్ని పెంచే వినూత్నమైన వీడియోలను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలో పెట్టుబడి అవకాశాల గురించి తెలియజేస్తూ ఇన్వెస్టర్లు తగిన నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాయి.
జెరోదా సేవలు 
‘‘అస్థిరతలతో కూడిన మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవర్తన అందరిదీ ఒకే విధంగా ఉంటుంది. కనుక గతంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా స్పందించార్న విషయంపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రాఫ్‌లు, చార్ట్‌ల సాయంతో ఈ తరహా మార్కెట్‌ పరిస్థితుల్లో ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నాం’’ అని జెరోదా సంస్థలో ఈక్విటీ పరిశోధన విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్‌ రంగప్ప తెలిపారు. జెరోదా సంస్థ వర్సిటీ, ట్రేడింగ్‌క్యుఎన్‌ఏ, జెడ్‌కనెక్ట్‌ అనే మూడు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇన్వెస్టర్ల ఆందోళనలు, ప్రశ్నలకు వీటి ద్వారా సమాధానాలు ఇస్తోంది. ఇప్పటి వరకు 46,000 విచారణలను ఈ సంస్థ స్వీకరించింది. ఆప్షన్ల ట్రేడింగ్‌, పన్నులపై ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రతి రోజూ 20 నుంచి 40 వరకు విచారణలు వస్తున్నాయని రంగప్ప పేర్కొన్నారు. ఫలానా స్టాక్‌ ఫలానా ధర ఉన్నప్పుడు ఇన్వెస్టర్‌ను అప్రమత్తం చేసేందుకు ‘సెట్‌ యాన్‌ అలర్ట్‌’ ఆప్షన్‌, స్టాక్‌ రిపోర్టులు, టెక్నికల్స్‌, ఫండమెంటల్స్‌, చార్ట్‌లను జెరోదా ఆఫర్‌ చేస్తోంది. వీటిని జెరోదా కైట్‌ మొబైల్‌ అప్లికేషన్‌, పోర్టల్‌ నుంచి సులభంగా పొందొచ్చు.
ఈటీ మనీ
అస్థిరతల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించే ప్రయత్నాన్ని ఈటీ మనీ కూడా చేస్తోంది. ‘‘వాస్తవ గణాంకాలు, సమాచారం ఆధారంగా అస్థిరతల సమయాల్లో ఎలా నడుచుకోవాలన్న దానిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించి రిపోర్టు కార్డులతో సులభమైన ఇంగ్లిష్‌లో తెలియజేస్తున్నాం’’ అని ఈటీ మనీ సీఈవో ముకేష్‌ కర్లా తెలిపారు. టైమ్స్‌ గ్రూపులో భాగమైన టైమ్స్‌ ఇంటర్నెట్‌కు చెందిన అనుబంధ కంపెనీయే ఈటీ మనీ.
ఇతర సంస్థలూ...
22 లక్షల యూజర్ల బేస్‌ కలిగిన గ్రోవ్‌ సంస్థ వీడియో కంటెంట్‌ను ఇన్వెస్టర్లకు అందిస్తోంది. ‘‘వీడియో, టెక్ట్స్‌ కోసం 12 మందితో కూడిన కంటెంట్‌ బృందం మాకు ఉంది. పెట్టుబడుల అంశాలపై మాట్లాడాలంటూ పరిశ్రమకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నాం. వీడియోలు చాలా సులభంగా, తక్కువ అంశాలతో అవగాహన కల్పించే విధంగా ఉండేలా చూస్తున్నాం’’ అని గ్రోవ్‌ సీఈవో హర్ష్‌జైన్‌ వెల్లడించారు. గ్రోవ్‌ యూట్యూబ్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 5,000 నుంచి 31,000కు పెరగ్గా, ఒక్కో వీడియోకు గతంలో 1,000 వ్యూస్‌ రాగా, అవి 10,000కు పెరిగాయి. పేటీఎం మనీ సైతం ముగ్గురు సభ్యుల బృందంతో యూజర్లపై మార్కెట్‌ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా సందేశాలు కస్టమర్లను సర్దుకునేలా చేస్తాయన్నారు పేటీఎం మనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ జాదవ్‌. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచంలో యూజర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొత్తేమీ కాదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడాన్ని సెబీ తప్పనిసరి కూడా చేసింది. అయితే, చిన్న పట్టణాల నుంచి కూడా ఇన్వెస్టర్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా కార్యక్రమాల అవసరం ఎంతో ఉందంటున్నారు నిపుణులు. ‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ గత కొన్నేళ్లలో బాగా విస్తరించాయి. అయితే, ప్రతి ఒక్కరూ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్పత్తులను సరైన విధంగా అర్థం చేసుకోవడం లేదు. పెట్టుబడులకు సంబంధించి రిస్క్‌లు, ఎంత కాలం పాటు పెట్టుడులు కొనసాగిస్తే ఎంత మేర రాబడులు వస్తాయన్న దానిపై ఆర్థిక సేవల విభాగం అవగాహన కల్పించాలి’’ అని ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలియన్స్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ ఎండీ మాధుర్‌సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. 

 You may be interested

బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి !

Wednesday 21st August 2019

మళ్లీ వెలుగులోకి కేంద్రం ప్రతిపాదన  -అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం  -బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి  కోల్‌కత: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న తన ప్రతిపాదనను కేంద్రం మళ్లీ వెలుగులోకి తెచ్చింది.  ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)నోటిఫై చేయడం కోసం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను  జారీ చేస్తామని బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్డాండర్డ్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ సురైనా రాజన్‌ పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న ముఖ్యంగా పుత్తడి వర్తకులతో సంప్రదింపులు అనంతరమే ఈ

కృష్ణపట్నం పోర్టులో అదానీకి మెజారిటీ వాటా?

Wednesday 21st August 2019

ఏపీఎస్‌ఈజడ్‌కు 72 శాతం వాటా! డీల్‌ విలువ రూ.5,500 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పోర్టుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గౌతమ్‌ అదానీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంటున్నట్టు సమాచారం. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌ అయిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 72 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకు పైగా

Most from this category