News


10వ తేదీ నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియ

Wednesday 5th June 2019
news_main1559727562.png-26105

  • జూలై 5 బడ్జెట్‌ సమర్పణకు
  • మోదీ సర్కారు సన్నద్ధం

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. సోమవారం నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ఆర్థికమంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ ముద్రణ కార్యకలాపాలు సోమవారంనాడు ప్రారంభకానున్నాయి. నాటి నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొననున్న అధికారులకు జూలై 5వ తేదీ వరకూ  బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలోని తాజా బడ్జెట్‌ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చం‍ద్ర గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం‍లో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్‌ చక్రవర్తి, ఫైనాన్స్‌ సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018-19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు. You may be interested

లాభాలొచ్చినా... వడ్డీకి సరి!

Wednesday 5th June 2019

తగ్గిన డిమాండ్‌; పేరుకుంటున్న నిల్వలు  వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం కొత్త రుణాలు  ఇప్పటికే పాత రుణాలతో కుదేలు  పాత, కొత్త రుణాలపై వడ్డీలు తడిసి మోపెడు  అమ్మకాలు పుంజుకున్నా, తగ్గిన నిర్వహణ లాభం కొత్త ప్రభుత్వ సంస్కరణలపై కార్పొరేట్ల ఆశలు గంప లాభం చిల్లి తీసిందని సామెత. దాదాపు మూడేళ్లపాటు అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇప్పుడిప్పుడే ఒక దారికి వస్తున్నాయి. అయితే అలాంటి కంపెనీల లాభాలను వడ్డీ చెల్లింపులు హరించేస్తున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన

సాంక్టమ్‌ నుంచి ఐదు సిఫార్సులు

Wednesday 5th June 2019

మిడ్‌టర్మ్‌లో 12-15 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ సిఫార్సు చేస్తోంది. 1. దీపక్‌ నైట్రేట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 375. స్టాప్‌లాస్‌ రూ. 310. గత సంవత్సరన్నర కాలంగా స్టాకు రూ. 205-305 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. వీక్లీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ ఏర్పరిచింది. గతవారం ఈ ధోరణి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చింది. బోలింగర్‌ బ్యాండ్‌ పైఅవధి పైన బ్రేకవుట్‌ సాధించడంతో ర్యాలీ కొనసాగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.

Most from this category