News


ఆటోమొబైల్‌కు జీఎస్‌టీ తగ్గింపుపై త్వరలోనే నిర్ణయం

Thursday 12th September 2019
news_main1568258154.png-28315

ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు: మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగానికి జీఎస్‌టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్‌టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆర్థిక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. 
రోడ్డు ప్రమాదాల నివారణకే అధిక జరిమానాలు
ట్రాఫిక్‌ జరిమానాలను భారీగా పెంచడాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమర్థించుకున్నారు. 30 ఏళ్ల తర్వాత జరిమానాలను పెంచినట్టు గుర్తు చేశారు. అధిక జరిమానాలు రోడ్డు ప్రమాదాలను నివారించంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహిస్తాయన్నారు. ఆదాయం పెంచుకోవడం కంటే ప్రాణాలను కాపాడడం కోసమే జరిమానాలను పెంచినట్టు వివరణ ఇచ్చారు. ఈ విషయమై ఎంతో సానుకూల స్పందన వచ్చినట్టు చెప్పారు.  రాష్ట్రాలు తమ పరిధిలో కావాలనుకుంటే ఈ జరిమానాలను తగ్గించుకోవచ్చని గడ్కరీ సూచించారు. 



You may be interested

‘‘ఐఫోన్‌ 11’’ సేల్‌ 27 నుంచి...

Thursday 12th September 2019

- ప్రారంభ ధర రూ. 64,900 - హైఎండ్‌ రూ. 109,900 కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్‌ 11’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత ధరలను.. ఆపిల్‌ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న  ‘ఐఫోన్‌ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్‌ 11 ప్రో’  ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్’ భారత ధర రూ.

22 కోట్ల షేర్లను విక్రయించిన ప్రమోటర్‌ సంస్థలు

Thursday 12th September 2019

విప్రో షేర్ల బైబ్యాక్‌లో  న్యూఢిల్లీ: విప్రో షేర్ల బైబ్యాక్‌లో అజిమ్‌ ప్రేమ్‌జీ, ఇతర ప్రమోటర్‌ సంస్థలు 22.46 కోట్ల షేర్లను కంపెనీకి అమ్మేశాయి. వీటి విలువ రూ.7,300 కోట్ల మేర ఉంటుందని అంచనా. గత నెలలో ముగిసిన షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 32.3 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌  చేశామని విప్రో కంపెనీ వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ.325కు కొనుగోలు చేశామని, మొత్తం రూ.10,500 కోట్లు షేర్ల బైబ్యాక్‌ కోసం

Most from this category