News


ఏడాదిలో 2,000 మంది నియామకం

Saturday 19th January 2019
Markets_main1547878537.png-23677

ఫిన్‌కేర్‌ ఎండీ రాజీవ్‌ యాదవ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకింగ్‌ సేవల రంగంలో ఉన్న ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతోంది. ఏడాదిలో కొత్తగా 2,000 మందిని చేర్చుకోనున్నట్టు బ్యాంక్‌ ఎండీ రాజీవ్‌ యాదవ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,200 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ‘11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. 14 లక్షల మంది కస్టమర్లున్నారు. అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం) రూ.2,899 కోట్లుంది. 2021 నాటికి ఏయూఎం రూ.10,000 కోట్లకు చేర్చాలన్నది ధ్యేయం. అలాగే 40 లక్షల కస్టమర్లకు చేరుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం. బ్యాంకింగ్‌ ఔట్‌లెట్లు ప్రస్తుతమున్న 532 నుంచి 5,000ల స్థాయికి తీసుకెళతాం. డిపాజిట్లపై వడ్డీ రేటు సీనియర్‌ సిటిజన్లకు 9.5 శాతం, ఎన్‌ఆర్‌ఐలకు 9 శాతం ఆఫర్‌ చేస్తున్నాం’ అని వివరించారు.



You may be interested

లాభం భేష్‌.. బోనస్‌ జోష్‌!

Saturday 19th January 2019

క్యూ3లో రూ. 2,544 కోట్లు ఆదాయంలో రూ. 10% వృద్ధి రూ.1 మధ్యంతర డివిడెండ్‌.. న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో నికర లాభం సుమారు 31.8 శాతం ఎగిసి రూ.2,544.5 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,930.1 కోట్లు. మరోవైపు, కంపెనీ ఆదాయం రూ. 10 శాతం వృద్ధితో రూ.13,669 కోట్ల నుంచి రూ.15,059.5 కోట్లకు చేరింది. క్యూ3 ఫలితాల

కెమికల్స్‌ కేంద్రం కార్బానియో!

Saturday 19th January 2019

ఆన్‌లైన్‌లో 4.5 లక్షల రసాయనాలు 8 నెలల్లో విదేశాల్లోకి ఎంట్రీ 2 నెలల్లో రూ.20 కోట్ల నిధుల సమీకరణ ‘స్టార్టప్‌ డైరీ’తో కార్బానియో ఫౌండర్‌ డాక్టర్‌ రఫీ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్‌లైలో దొరకనిదంటూ ఏదీ లేదు. కెమికల్స్‌తో సహా! అలాగని, ఆన్‌లైన్‌లో రసాయనాలను విక్రయించడం తేలికేమీ కాదు. ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరు కొంటున్నారు? ఇవన్నీ కీలకమే. లేకుంటే చాలా అనర్థాలొస్తాయి. దీన్నో సవాలుగా తీసుకుని... కెమికల్స్‌ పరిశ్రమను సంఘటిత పరిచి.. ఆన్‌లైన్‌లో

Most from this category