News


బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక ప్యాకేజీ

Tuesday 10th September 2019
news_main1568092397.png-28283

  • ఆర్థిక శాఖా పరిశీలనలో ఉంది
  • కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌

కోచి: నిధుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్‌వాల్‌ తెలిపారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖా మంత్రి అయిన ఆయన సోమవారం కోచి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, అదే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక సహకారం అవసరం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రోత్సహించాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందున్న అధిక ప్రాధాన్యం ఇదే. అంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ సజావుగా పనిచేయాలి. అందుకే ప్యాకేజీ గురించి యోచిస్తున్నాం. బీఎన్‌ఎస్‌ఎల్‌కు భవిష్యత్తులో ప్యాకేజీ ఇవ్వడాన్ని చూస్తారు’’ అని ఎన్‌డీయే 100 రోజుల పాలన ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందజేసిన ప్యాకేజీ ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1995లో సమస్యలు చుట్టుముట్టాయని, కానీ ప్రస్తుతం అయితే, ప్రభుత్వం ముందుకే తీసుకెళ్లాలనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. మూసివేసే ఆలోచన లేదన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ విలీనం గురించి అధికారులతో చర్చించడం జరిగిందని, కానీ కొన్ని యూనియన్లు మాత్రం వాటిని వేర్వేరుగానే కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.



You may be interested

లినెన్‌ రిటైల్‌లోకి ‘లినెన్‌ హౌజ్‌’

Tuesday 10th September 2019

ఏడాదిలో 100 స్టోర్ల ఏర్పాటు విస్తరణకు రూ.50 కోట్లు వ్యయం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లినెన్‌ వస్త్రాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్‌ లినెన్‌ హౌజ్‌ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్‌ హౌజ్‌ను ప్రమోట్‌ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్‌ డైరెక్టర్‌ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్‌, త్రిపురనేని విజయ్‌, ఉప్పలపాటి కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్‌మీడియరీ

Tuesday 10th September 2019

గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌పై కమిటీ సిఫారసులు ముంబై: గృహ రుణ సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో ఓ మధ్యవర్తిత్వ (ఇంటర్‌ మీడియరీ) సంస్థను 51 శాతం ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేయాలని సూచించింది. బెయిన్‌ అండ్‌ కో సీనియర్‌ అడ్వైజర్‌ హర్ష్‌ వర్ధన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 29న ఆర్‌బీఐ

Most from this category