‘ఎంఎస్ఎంఈ’ కోసం బ్యాంకుల్లో జీఎంలు
By Sakshi

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బ్యాంకులు జనరల్ మేనేజర్ (జీఎం) స్థాయి అధికారులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల లభ్యతపై ప్రగతిని విశ్లేషించేందుకు, సమస్యల పరిష్కారానికి చీఫ్ మేనేజర్ లేదా జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను నియమించాలని అన్ని ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఎన్పీఏలు, వాటి పునరుద్ధరణకు సంబంధించి తగిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. ఎంఎస్ఎంఈలకు 59 నిమిషాల్లో రూ.కోటి వరకు రుణాలను అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు సహా ఎన్నో ప్రోత్సాహక చర్యలను కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన విషయం గమనార్హం. టెక్నాలజీ అప్‌గ్రేడ్, సులభ వ్యాపార నిర్వహణ, ఉద్యోగుల సామాజిక భద్రతకు నిధుల కేటాయింపులు సహా మొత్తం 12 చర్యలను మోదీ సర్కారు చేపట్టింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వీటిని తీసుకొచ్చింది.
You may be interested
త్వరలో పేమెంట్ సర్వీసులు ప్రారంభించనున్న వాట్సాప్
Friday 28th June 2019బెంగళూరు: మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినట్లుగా పేమెంట్ డేటాను భారత్‌లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత
స్విస్ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!
Friday 28th June 201920 ఏళ్ల కనిష్ఠానికి చేరిన డిపాజిట్లు భారత ఖాతాదారులదీ అదే తీరు జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన గణాంకాల్లో