News


ఎస్‌బీఐ చీఫ్‌ను అవమానించిన ఆర్థిక మంత్రి

Monday 16th March 2020
news_main1584334487.png-32498

  • సోషల్ మీడియాలో వైరల్‌గా ఆడియో క్లిప్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేం‍ద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం అయనేనంటూ నిర్మలా సీతారామన్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఎస్‌బీఐ జాలి లేని బ్యాంకంటూ ఆక్షేపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్ కుమార్‌ను నిర్మలా సీతారామన్ ఘోరంగా అవమానించినట్లు ఆడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 27న గువాహటిలో ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు, రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత  బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) ఖండించింది. ఎస్‌బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని పేర్కొంది. 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌.. ప్చ్‌

Monday 16th March 2020

ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ఓపెనింగ్‌ ఇష్యూ ధర రూ. 755 ఇంట్రాడేలో రూ. 656-749 మధ్య ఊగిసలాట ఉదయం 10.15కల్లా రూ. 750కు రికవరీ మార్కెట్లో తొలుత భారీ ఆసక్తిని రేకెత్తించిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 755తో పోలిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 94 నష్టంకాగా.. తదుపరి రూ. 656 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి

నేటి వార్తల్లోని షేర్లు

Monday 16th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఇండియా బుల్స్‌ హౌసింగ్స్‌: షల్‌ మీడియాలో తమపై వస్తున్న వార్తలు ఆవాస్తవమని, తాము యస్‌ బ్యాంక్‌ నుంచి ఎటువంటి లోన్‌లు తీసుకోలేదని ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. మారికో,ఇమామీ: సూపర్‌ వాస్‌మోల్‌ హెయిర్‌ కలర్‌ను రూ.1,500-1,800 కోట్లకు విక్రయించేందుకు  గోద్రేజ్‌ కన్జూమర్‌, మారికో, ఇమామీ, డాబర్‌, హెచ్‌యూల్‌లను సూపర్‌ వాస్‌ముల్‌ మాతృసంస్థ సంప్రదించినట్లు తెలస్తోంది. ఐడీఎఫ్‌సీ: యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు

Most from this category