News


పీఎస్‌బీల ‘ఈబిక్రయ్‌’

Friday 3rd January 2020
news_main1578022168.png-30633

స్వాధీనం చేసుకున్న ఆస్తుల వేలానికి పోర్టల్‌
ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్‌ ‘ఈబిక్రయ్‌’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) చీఫ్‌లు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంకింగ్‌ రంగ అంశాలపై మంత్రి చర్చించారు. వ్యాపార రీత్యా వివేకంతో తీసుకునే నిర్ణయాలకు రక్షణ ఉంటుందన్న హామీ ఈ భేటీలో లభించింది. డిజిటల్‌ చెల్లింపుల ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసి, నగదు వినియోగాన్ని తగ్గించేందుకు రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న వ్యాపార సం‍స్థలకు తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్‌ చెల్లింపుల విధానాలను తీసుకొస్తామని మంత్రి బడ్జెట్‌లో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇందులో భాగంగా రూపే, యూపీఐ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)ను ఎత్తివేస్తూ కేంద్ర రెవెన్యూ విభాగం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రూపే కార్డు, యూపీఐ ప్రచారం కోసం అన్ని బ్యాంకులు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపింది.
ఈబిక్రయ్‌....
గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్‌బీలు రూ.2.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని మరింత పారదర్శకంగా వేలం వేసి, అదనపు విలువను పొందేందుకు వీలుగా ఈబిక్రయ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఈ ఆక్షన్‌ పోర్టళ్లకు ఇది అనుసంధానంగా వ్యవహరిస్తుంది. అలాగే, ప్రాపర్టీలను అన్వేషించేందుకు సెర్చ్‌ టూల్‌ను కూడా ఏర్పాటు చేశారు. పీఎస్‌బీల తరఫున వేలానికి వచ్చే అన్ని ఆస్తుల వివరాలను ఈ పోర్టల్‌ నుంచే తెలుసుకోవచ్చు. 



You may be interested

ఇరాక్‌ టెన్షన్‌- పసిడి, చమురుకు రెక్కలు

Friday 3rd January 2020

గురువారం రాత్రి ఇరాక్‌లోని బాగ్దాద్‌ వద్ద అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు వెలువడిన వార్తలు అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలకు ఆజ్యం పోశాయి. ఈ దాడుల కారణంగా బాగ్దాద్‌  విమానాశ్రయం వద్ద ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ఇద్దరు ముఖ్య అధికారులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చన్న ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక

వ్యవస్థలోకి ఆర్‌బీఐ మరిన్ని నిధులు!

Friday 3rd January 2020

ద్రవ్య లభ్యత పెంపునకు చర్యలు 6న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓ చర్యలు ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది.

Most from this category