News


బ్యాంక్స్‌ చీఫ్‌లతో నేడు ఆర్థిక మంత్రి భేటీ

Monday 14th October 2019
news_main1571021075.png-28855

  • రుణ వితరణ తదితర అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) సమావేశం కానున్నారు. చిన్న, మధ్య తరహా సంస్థలు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) మొదలైన రంగాలకు నిధుల లభ్యత, రుణ వితరణ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్షిక రుణ హామీ పథకం, మూలధనం పెంచుకునేందుకు మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ అంశాల్లో పురోగతిపై ఆయా బ్యా్ంకులు నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 226 జిల్లాల్లో నిర్వహించిన రుణ మేళాలపైనా చర్చించవచ్చని తెలిపాయి. వ్యవసాయ, వాహన, గృహ, చిన్న మధ్యతరహా సంస్థలు, విద్యా, వ్యక్తిగత రుణాల కోసం ఉద్దేశించిన తొలి దశ రుణ మేళా అక్టోబర్ 7న ముగిసింది. దీపావళికి ముందు.. అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్ 25 దాకా 209 జిల్లాల్లో బ్యాంకులు మరో విడత రుణ మేళా నిర్వహించనున్నాయి. నెల రోజుల వ్యవధిలో పీఎస్‌బీల చీఫ్‌లతో నిర్మలా సీతారామన్ భేటీ కావడం ఇది రెండోసారి. 



You may be interested

అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం శుభ పరిణామం

Monday 14th October 2019

ఇండియన్‌ బ్యాంక్‌ సీఈఓ పద్మజ చుండూరు సాక్షి, విజయవాడ: అలహాబాద్‌ బ్యాంకును తమ బ్యాంకులో విలీనం చేయడం శుభ పరిణామమని ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌ ఉన్నతస్థాయి అధికారులు, ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న

ఐఆర్‌సీటీసీ లిస్టింగ్‌ నేడే

Monday 14th October 2019

బంపర్‌ లాభాలకు చాన్స్‌... ఇష్యూ ధర రూ.320 లిస్టింగ్‌ రూ.500 పైనే ఉండొచ్చని అంచనాలు... న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) షేర్లు నేడు (సోమవారం) స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. సెప్టెంబర్‌ 30న మొదలై ఈ నెల 4న ముగిసిన ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా ఐఆర్‌సీటీసీ రూ.638 కోట్లు సమీకరించింది. రూ.10 ముఖ విలువ,  రూ.315-320 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఒక

Most from this category