News


ఆర్థిక లక్ష్యాలపై కేంద్రంతో చేతులు కలపండి

Saturday 22nd June 2019
news_main1561176562.png-26486

  • రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఆర్థిక లక్ష్యాల సాధనకు కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వృద్ధికి కేంద్రం ఒక దిశను నిర్దేశించుకుంటోందని పేర్కొన్న ఆమె, అయితే ఈ లక్ష్యాలను సాధించడానికి క్షేత్ర స్థాయిలో రాష్ట్రాలూ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. రాష్ట్రాల సహకారం లేనిదే కేంద్రం తన లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె బడ్జెట్‌ ముందస్తు సంప్రతింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీతారామన్‌ ఈ కీలక వాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు కేంద్ర నుంచి నిధుల బదలాయింపు పరిమాణం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు. పన్ను బదలాయింపుల విషయం చూస్తే, 13వ ఆర్థిక కమిషన్‌ సమయంలో 32 శాతం ఉంటే, 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సమయంలో (ఎన్‌డీఏ మొదటి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలం) ఈ రేటు 42 శాతానికి చేరిందన్నారు. కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ వర్గాలతో బడ్జెట్‌ ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని తాజా బడ్జెట్‌ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చం‍ద్ర గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం‍లో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్‌ చక్రవర్తి, ఫైనాన్స్‌ సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018-19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు. You may be interested

అక్రమ లాభార్జనపై 10 శాతం జరిమానా

Saturday 22nd June 2019

విద్యుత్‌ వాహనాలపై పన్ను తగ్గింపును తేల్చనున్న ఫిట్‌మెంట్‌ కమిటీ  జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు లాటరీలపై ఒకే పన్ను అంశంలో కుదరని ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలపై, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన్సిల్‌ 35వ భేటీ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా

ఈ-కామర్స్‌ @ ఎట్‌ మేడిన్ ఇండియా

Saturday 22nd June 2019

దేశీయంగా తయారీపై దృష్టి భారత్‌లో సొంత ప్రైవేట్‌ లేబుల్స్‌ ఉత్పత్తి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ దేశీ బాట భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్‌ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు  ఈ–కామర్స్‌ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్‌ కోసం చైనా, మలేషియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ కొన్నాళ్లుగా మేడిన్‌ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల

Most from this category