News


కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గాలి.

Monday 14th January 2019
news_main1547451141.png-23571

రూ.20 లక్షలపైన వేతన జీవులకే 30 శాతం పన్ను
కేంద్రానికి ఫిక్కీ ముందస్తు బడ్జెట్‌ సూచనలు

న్యూఢిల్లీ: టర్నోవర్‌తో సంబంధం లేకుండా కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి రానున్న బడ్జెట్‌లో తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పారిశ్రామిక సంఘం ఫిక్కీ కోరింది. ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, పన్నుల ఆదాయం పెరిగేందుకు ఈ చర్యను సూచించింది. అలాగే, వ్యక్తిగత ఆదాయపన్నులో గరిష్ట రేటు 30 శాతాన్ని వార్షికాదాయం రూ.20 లక్షలు దాటినవారికే వర్తింపచేయాలని బడ్జెట్‌ ముందస్తు సూచనల్లో భాగంగా కోరింది.  ‘‘వ్యాపార సంస్థలు ఈ రోజు అధిక పన్నుల వ్యయాలను ఎదుర్కొంటున్నాయి. ఇవి తయారీ వ్యయాన్ని కూడా పెంచుతాయి. దాంతో తిరిగి పెట్టుబడులకు, విస్తరణకు మిగులు నిధులు తక్కువగా ఉంటాయి. 30 శాతం కార్పొరేట్‌ పన్ను, డివిడెండ్‌ పంపిణీ పన్ను 20 శాతం కూడా కలిపి చూస్తే ఓ కంపెనీపై వాస్తవిక పన్ను భారం అధికంగా ఉంటుంది’’ అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పన్ను రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నాయంటూ.. భారత్‌లోనూ వ్యాపార పరంగా పన్నులు తగ్గాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత 18.5 శాతం ప్రత్యామ్నాయ పన్ను రేటు చాలా ఎక్కువని అభిప్రాయపడింది. ఈ స్థాయి నుంచి గణనీయంగా తగ్గించాలని కోరింది. అలాగే, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని తగ్గించాలని, మొత్తం మీత పన్ను మినహాయింపులను రూ.3 లక్షలకు పెంచాలని కోరింది. ఉద్యోగుల ఒక్కో భోజనం రూ.50పైన ఇస్తున్న పన్ను మినహాయింపును రూ.200కు చేయాలని కోరింది.You may be interested

2018లో ఇళ్ల విక్రయాల్లో 7 శాతం వృద్ధి

Monday 14th January 2019

హైదరాబాద్‌లో 17 శాతం పడిపోయిన అమ్మకాలు 9 ప్రధాన పట్టణాల్లో పరిస్థితులపై ప్రాప్‌ టైగర్‌ నివేదిక న్యూఢిల్లీ: నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లకు డిమాండ్‌ నెలకొనడంతో... 2018లో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు మొత్తం మీద 7 శాతం పెరిగాయి. ప్రాప్‌ ఈక్విటీ అనే సంస్థ పరిశోధనలో ఈ వివరాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం 22 శాతం తగ్గి గతేడాదిలో 1.46 లక్షల యూనిట్లకు పరిమితం అయ్యాయి.

ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..

Monday 14th January 2019

సోమవారం వెల్లడికానున్న డ‌బ్ల్యూపీఐ, సీపీఐ శుక్రవారం విదేశీ మారక నిల్వల సమాచారం వెల్లడి ఈ వారంలోనే ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్‌ ముగింపును నమోదుచేశాయి. ఇక

Most from this category