News


ఫియట్‌ క్రిస్లర్‌, రెనోల విలీనం..!

Tuesday 28th May 2019
news_main1559027701.png-25951

పారిస్: ప్రపంచ ఆటోమొబైల్‌ పరిశ్రమలో మరో అతిపెద్ద డీల్‌కు తెరలేవనుంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీలైన ఫియట్‌ క్రిస్లర్‌, రెనో సంస్థల మధ్య విలీన ఒప్పంద చర్చలు మొదలయ్యాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్‌లోని రెనో ప్రధానకార్యాలయంలో ఇరు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. ఫియట్‌ క్రిస్లర్‌ ప్రతిపాదనను ఎంతో ఆసక్తితో అధ్యయనం చేస్తున్నట్లు రెనో ప్రకటించి.. విలీనానికి మార్గం సుగమంకానుందనే సంకేతాలు ఇచ్చింది. జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌తో రెనో విలీన ప్రతిపాదన ఉన్నప్పటికీ.. ఆ సంస్థ చైర్మన్‌ కార్లోస్‌ ఘోసన్‌ ఆర్థిక నేరాల ఆరోపణలపై జపాన్‌లో అరెస్ట్‌కావడంతో డీల్‌ ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా ఫియట్‌ క్రిస్లర్‌తో విలీన చర్చలతో మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ సంస్థ అవతరణకు ఆస్కారం ఉంది. నూతనతరం ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్వతంత్ర వాహనాల తయారీ లక్ష్యంగా ప్రతిపాదన ఇచ్చినట్లు అమెరికాలో బలమైన కంపెనీగా అవతరించి, ఎస్‌యూవీ మార్కెట్లో సత్తా చాటిన ఫియట్‌ క్రిస్లర్‌ వెల్లడించింది. 



You may be interested

జాగరణ్‌ ప్రకాశన్‌ చేతికి బిగ్‌ఎఫ్‌ఎం

Tuesday 28th May 2019

రూ.1,050 కోట్లకు డీల్‌ తగ్గనున్న అనిల్‌ కంపెనీల రుణభారం ముంబై: తీవ్ర రుణ భారంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్న రిలయన్స్‌ అనిల్‌ దీరూభాయి అంబానీ (అడాగ్‌) గ్రూపు అధినేత అనిల్‌ అంబానీ, ఆ భారాన్ని తగ్గించుకునే దిశగా మరో ముందడుగు వేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్‌ కుదుర్చుకోగా, బిగ్‌ఎఫ్‌ఎం పేరుతో దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎం చానళ్లను

‘హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు’పై ఐసీఐసీఐ బ్యాంకుకు చుక్కెదురు

Tuesday 28th May 2019

దివాలా పిటిషన్‌ను కొట్టేసిన ఎన్‌సీఎల్‌టీ న్యూఢిల్లీ: హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్ట్స్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొట్టివేసింది. పిటిషన్ల విషయంలో నకలు ఉందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే తన కార్పొరేట్‌ గ్యారంటర్‌ అయిన ఎరా ఇన్‌ఫ్రా ఇంజీనరింగ్‌కు వ్యతిరేకంగా ఇదే తరహా క్లెయిమ్‌ దాఖలు చేసిందని, ఇది కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో (సీఆర్‌ఐపీ)

Most from this category