News


తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు

Tuesday 21st January 2020
news_main1579575166.png-31058

- 32 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 32 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.441 కోట్లకు పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,300 కోట్ల నుంచి రూ.3,738 కోట్లకు ఎగసిందని పేర్కొంది. బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. గత క్యూ3లో 3.14 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 2.99 శాతానికి, నికర మొండి బకాయిలు 1.72 శాతం నుంచి 1.63 శాతానికి తగ్గాయని తెలిపింది. 
మొండి బకాయిలు తగ్గడంతో పాటు నికర లాభం 32 శాతం పెరగడంతో ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్‌ లాభపడింది. 



You may be interested

బడ్జెట్‌ను మించిపోయిన బిలియనీర్ల సంపద

Tuesday 21st January 2020

1 శాతం కుబేరుల వద్దే అత్యధిక ఐశ్వర్యం దేశీయంగా 70% సామాన్యులతో పోలిస్తే 4 రెట్లు అధికం ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ నివేదిక దావోస్‌:  పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ .. పూర్తి ఆర్థిక సంవత్సర

కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.1,596 కోట్లు

Tuesday 21st January 2020

క్యూ3లో 24 శాతం వృద్ధి  పెరిగిన మొండి బకాయిలు (అప్‌డేటెడ్‌...) న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,596 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సంర ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,291 కోట్లతో పోల్చితే 24 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,214 కోట్ల నుంచి రూ.8,077 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని

Most from this category