News


ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం రూ. 417 కోట్లు

Wednesday 16th October 2019
news_main1571219186.png-28926

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ మంగళవారం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ2లో కంపెనీ రూ.417కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.266 కోట్లతో పోలిస్తే ఇది 56.3శాతం అధికం. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ పన్ను వ్యయం నికరలాభం పెరిగేందుకు కారణమైనట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,748.44 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.3,135.97 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ2లో నికరవడ్డీ ఆదాయం రూ.1,182.53 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ. 1,051.84 కోట్ల నికర వడ్డీ ఆదాయంతో పోలిస్తే ఇది 12.42శాతం అధికంగా ఉంది. వార్షిక ప్రాతిపదికన క్యూ2లో ప్రొవిజన్లు తగ్గాయి. త్రైమాసిక ప్రాతిపాదికన పెరిగాయి. ఈ క్యూ2లో రూ.253 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.192 కోట్లుగానూ, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.288.8 కోట్లుగానూ నమోదయ్యాయి. ఆస్తుల నాణ్యత బలహీనపడింది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏలు 2.99శాతం నుంచి 3.07శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీలు సైతం 1.49శాతం నుంచి 1.59శాతానికి ఎగిశాయి. తాజా స్లిపేజ్‌లు రెండో త్రైమాసికం ముగిసే నాటికి రూ. 540 కోట్లుగా ఉన్నాయి. మొదటి త్రైమాసికం చివరి నాటికి రూ.415 కోట్లుగా నమోదయ్యాయి. 

ఫలితాల ప్రకటన నేపథ్యంలో మధ్యాహ్నం గం.3:00లకు ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు 2.75శాతం నష్టపోయి రూ.82.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఐకానిక్‌ బజాజ్‌ ‘చేతక్‌’ తిరిగొచ్చింది!

Wednesday 16th October 2019

బజాజ్‌ ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా తిరిగి మార్కెట్‌లో సందడి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ-స్కూటర్లను(ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌) చేతక్‌ బ్రాండ్‌తో విక్రయించాలని బజాజ్‌ కంపెనీ భావిస్తోంది. కాగా సుమారుగా పదేళ్ల కిందట బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ తయారిని నిలిపివేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ తిరిగి వస్తున్నప్పటికి ఇది సాంప్రదాయ స్కూటర్‌లా ఉండదని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ అన్నారు.  చేతక్‌ స్కూటర్‌ను బుధవారం కేంద్ర

ఆల్‌ టైం గరిష్ఠానికి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌

Wednesday 16th October 2019

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సురెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ సాక్‌పై అనేక బ్రోకరేజిలు బై సిఫార్సును ఇచ్చాయి. ఫలితంగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో రూ. 892 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. కాగా ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతానికిపైగా లాభపడడం గమనార్హం. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌  క్యూ2 ఫలితాలలో నికర లాభం 48.2

Most from this category