News


ఫిబ్రవరిలో టోకు ధరలు తగ్గాయ్‌

Monday 16th March 2020
news_main1584350791.png-32508

 మనదేశంలో టోకు ధరలు ఫిబ్రవరిలో గణనీయంగా తగ్గాయి. ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు తగ్గడంతో ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.26 శాతం తగ్గిందని వాణిజ్య పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. జనవరిలో టోకు ధరలు 3.1 శాతం ఉండగా ఫిబ్రవరిలో అది 2.26 తగ్గినట్లు తెలిపింది. కాగా టోకుధరల సూచి ప్రకారం 2018 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.93 శాతంగా ఉంది. ఈ జనవరిలో ఉల్లిపాయల టోకు ధర 293.37 శాతం ఉండగా ఫిబ్రవరిలో ఇది తగ్గి 162.3 శాతానికి చేరింది. అదేవిధంగా కూరగాయల ధరలు 52.73 శాతం నుంచి 29.97 శాతానికి చేరాయి. ఇక తయారీ ఉత్పత్తుల టోకు సూచీలో 64.23 శాతం, ఉండగా పవర్‌, ఇంధన ద్రవ్యోల్బనం 3.38 శాతంగా ఉంది.



You may be interested

మార్కెట్‌ పతనంలో ఈ 10 షేర్లను కొనవచ్చు

Monday 16th March 2020

మార్కెట్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పడు నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. గడిచిన రెండు వారాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ 17.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ధీర్ఘకాలంలో ఈ షేర్లు రివకరి అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో మంచి రాబడులను ఇచ్చే స్టాక్‌లకు ఎన్నుకోవడం కొద్దిగా కష్టం. తక్కువ వాల్యూయేషన్స్‌, బలమైన ఆర్‌ఓఈ(రెవెన్యూ ఆన్‌ ఈక్విటీ), స్థిరమైన ఆదాయం,

రిస్క్‌కు నిలవగలిగి, మిగులు సొమ్ముంటేనే.. !

Monday 16th March 2020

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తేలిపోవచ్చు దశాబ్దాలుగా కేంద్ర బ్యాంకుల విధానాలివే.. కేంద్ర బ్యాంకులకంటే హెల్త్‌కేర్‌ వ్యవస్థ మేలు షేర్లు పతనమయ్యాయని ఎంచుకోవద్దు బ్యాలన్స్‌షీట్‌, యాజమాన్యం వంటి అంశాలు చూడాలి - అరవింద్‌ శాంగర్‌, జియోస్ఫియర్‌ కేపిటల్‌ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ముట్టడిని ఎదుర్కొనేందుకు తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. అయితే దశాబ్దాలుగా సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర బ్యాంకులు ఇవే విధానాలను అవలంబిస్తున్నాయి.

Most from this category