News


విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి

Saturday 7th December 2019
news_main1575691693.png-30105

  • ఈ-కామర్స్ సంస్థలకు కొత్త నిబంధన

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థలు ఇకపై తమకు అందే విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన వివరాలను .. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తెలియజేయాల్సి రానుంది. తాము ఎఫ్‌డీఐ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తున్నామంటూ ఏటా సెప్టెంబర్ 30లోగా ఆడిటర్‌ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీన్ని అమలు చేసే క్రమంలో ఆయా సంస్థల వ్యయాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ-కామర్స్ కంపెనీలు ఎఫ్‌డీఐ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని దేశీ వ్యాపారస్థుల సమాఖ్య సీఏఐటీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పుష్కలంగా విదేశీ పెట్టుబడుల ఊతంతో ఈ-కామర్స్ కంపెనీలు అడ్డగోలు డిస్కౌంట్లు ఇస్తూ చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 



You may be interested

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

Saturday 7th December 2019

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. మునుపటి చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, శుక్రవారం చతుర్వేది చైర్మన్‌ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన

నెఫ్ట్‌ లావాదేవీలు ఇక 24x7

Saturday 7th December 2019

రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ డిసెంబర్‌ 16 నుంచి అమల్లోకి ముంబై: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్‌ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్‌ 16న (డిసెంబర్‌ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి

Most from this category