News


సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు..!

Monday 26th August 2019
news_main1566792943.png-28010

న్యూఢిల్లీ: స్థానిక సోర్సింగ్ నిబంధనల నుంచి సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరటనివ్వనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ తరహ వ్యాపారులు తప్పనిసరిగా 30 శాతం వస్తువులను ప్రాంతీయ వ్యాపారుల నుంచి మాత్రమే కొనుగోలుచేయాల్సి ఉంటుంది. ఈ అంశంలో వీరికి ఊరటలభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌ విక్రయాల్లోనూ నిబంధనలు సులభతరంకానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ప్లేయర్లు ముందుగా స్టోర్లను ఏర్పాటుచేసి, ఆ తరువాత మాత్రమే ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించాలి. ఈ నిబంధనను ఎత్తివేసి.. ఫిజికల్‌ స్టోర్స్‌ కంటే ముందుగానే ఆన్‌లైన్‌ విక్రయాలు ప్రారంభించే వెసులుబాటును కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ రంగానికి ప్రయోజనం చేకూరే విధంగా పలు నిర్ణయాలను తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.



You may be interested

మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా...?

Monday 26th August 2019

గరిష్టంగా రూ.లక్షకే ఒక బ్యాంకులో బీమా వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్‌ ఒకే బ్యాంకులో చేసుకోదలిస్తే కుటుంబ సభ్యుల పేర్లతో చిన్న డిపాజిట్లుగా విడగొట్టడం వల్ల పలు ప్రయోజనాలు అవసరమైన సందర్భంలో ఒక డిపాజిట్‌ రద్దు చేసుకోవచ్చు వడ్డీ రేట్లు తగ్గుతున్నందున వివిధ కాలావధులకు డిపాజిట్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అన్నది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వసనీయమైన, సౌకర్యమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. ఎన్నో దశాబ్దాలుగా ఎక్కువ మంది అనుసరించే సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో కాల

తీవ్రమైన ట్రేడ్‌ వార్‌..పతనంలో ఆసియా మార్కెట్లు

Monday 26th August 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ (హెచ్‌ఎస్‌ఐ) దాదాపు 3 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ (ఎస్‌హెచ్‌కాంప్) 1.2శాతం నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 (ఎన్‌225) 2.2 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (కోస్పి) 1.7 శాతం క్షీణించాయి. యునైటెడ్ స్టేట్స్(యుఎస్‌), చైనా  రెండు దేశాలు సుంకాలను పెంచడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌

Most from this category