News


పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు

Monday 13th January 2020
news_main1578886141.png-30873

  • గడిచిన పదేళ్లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక

ముంబై:  గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్‌పీఏ) దాదాపు 82 శాతం. ఎస్‌బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్‌పీఏలు రూ. 1.1 లక్షల కోట్లకు చేరాయి. "మొత్తం ఎన్‌పీఏల్లో వ్యవసాయ రంగ బాకీలు రూ.1.1 లక్షల కోట్లుగానే ఉన్నా.. గడిచిన దశాబ్ద కాలంగా మాఫీ చేసిన సుమారు రూ. 3.14 లక్షల కోట్ల రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు, ప్రభుత్వాల మీద ఏకంగా రూ. 4.2 లక్షల కోట్ల పైగా భారం పడినట్లే. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరో రూ. 45,000-51,000 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 4.7 లక్షల కోట్లకు చేరుతుంది. మొత్తం పరిశ్రమ స్థాయిలో పేరుకుపోయిన మొండిబాకీల్లో ఇది 82 శాతం అవుతుంది" అని ఎస్‌బీఐ రీసెర్చ్‌ పేర్కొంది. 
    రుణభారాలతో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల సమస్య తీవ్రతను తగ్గించేందుకు పది పెద్ద రాష్ట్రాలు 2015 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రూ. 24,000 కోట్లు, తెలంగాణ రూ. 17,000 కోట్లు, తమిళనాడు రూ. 5,280 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశాయి. నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మాఫీల్లో అత్యధిక భాగం తూతూమంత్రంగానే జరిగిందని .. వాస్తవ రైటాఫ్‌లు 60 శాతం మించబోవని నివేదిక పేర్కొంది. 



You may be interested

ఇదేం గ్యాస్ ధరల విధానం..

Monday 13th January 2020

భారత్‌ తీరుపై ఐఈఏ ఆక్షేపణ న్యూఢిల్లీ: సహజ వాయువు ధర విధానానికి సంబంధించి భారత్ తీరును అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్రంగా ఆక్షేపించింది. అంతర్జాతీయంగా అత్యంత చౌక ప్రామాణిక ధరకు దేశీ గ్యాస్‌ రేటును ముడిపెట్టడం వల్ల .. తయారీ సంస్థలు ఉత్పత్తి పెంచుదామనుకున్నా.. ప్రోత్సాహకం లేకుండా పోతోందని పేర్కొంది. పర్యావరణానికి అనుకూలమైన గ్యాస్‌ ఉత్పత్తి మరింత పెరగాలంటే.. పన్నుల విషయంలో మిగతా ఇంధనాల తరహాలోనే దీనికి కూడా సమానస్థాయి

2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు అసాధ్యమే

Monday 13th January 2020

ఆర్థికవేత్త నాగరాజ్‌ న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌ నాగరాజ్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో

Most from this category