News


ఎఫ్‌ఎంసీజీపై జెఫర్రీస్‌ మక్కువ

Saturday 29th December 2018
news_main1546076365.png-23312

రాబోయే కొన్ని నెలల్లో ఎఫ్‌ఎంసీజీ స్టాకులు పాజిటివ్‌గా ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ జెఫర్రీస్‌ అంచనా వేస్తోంది. సమీప భవిష్యత్‌లో ముడిపదార్ధాల ధరలు తగ్గడం, వినిమయ డిమాండ్‌ పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ స్టాకుల రీరేటింగ్‌ సంభవించవచ్చని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు చల్లారడంతో ఈ కంపెనీల మార్జిన్లు విస్తృతమవుతాయని వివరించింది. అయితే ఈ రంగంలో స్టాకులను ఎంచుకునేముందు వాల్యూషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

గత కొన్ని నెలలుగా ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆహార ఉత్పత్తుల ధరలను ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు పెంచాయి. ఇప్పుడీ పెరిగిన ధరల ప్రయోజనాలు కంపెనీలకు అందుతాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. నెల రోజుల్లో  ముడిపదార్ధాల ధరలు దాదాపు 3.2 శాతం తగ్గాయని తెలిపింది. ముఖ్యంగా క్రూడాయిల్‌ ధర 22 శాతం పతనం కావడం, ఎల్‌ఏబీ(డిటర్జెంట్లులో వాడతారు) ధర 11 శాతం, మెంథా దర 8 వాతం, పామాయిల్‌ ధర 13 శాతం, కాఫీ ధర 14 శాతం, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ధర 7 శాతం, పంచదార ధర 6 శాతం మేర క్షీణించడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇకపై కంపెనీల ప్రమోషన్‌ వ్యవహారాలు ఎంత బాగున్నాయన్నది కూడా కీలకం కానుందని వ్యాఖ్యానించింది. 
ఈ రంగంలో హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, గోద్రేజ్‌ సంస్థల వాల్యూషన్లు అధికంగా ఉన్నాయని జెఫర్రీస్‌ తెలిపింది. వీటికి బదులు కొత్త ఏడాది సత్తా చూపించే అవకాశం ఉన్న ఐటీసీ, డాబర్‌, నెస్లెలను ఎంచుకోవచ్చని సూచించింది. మారికో, ఇమామీ, కోల్గేట్‌, యూఎన్‌ఎస్‌పీపై న్యూట్రల్‌గా ఉన్నట్లు తెలిపింది.You may be interested

ఎంఎఫ్‌ మదుపరులకు పాఠాలు

Saturday 29th December 2018

ఈ సంవత్సరం మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు మిశ్రమ ఫలితాలు అందాయి. 2018లో ఎంఎఫ్‌ మార్కెట్‌ మదుపరులకు మూడు పాఠాలు నేర్పింది. 1. టాప్‌ అప్‌ మరువద్దు: మార్కెట్లు వెనుకంజ వేసిన తరుణంలో ఎంఎఫ్‌ పోర్టుఫోలియోను టాప్‌ అప్‌ చేసుకున్నవాళ్లకు ఈ ఏడాది మంచి రాబడులే వచ్చాయి. కేవలం మొదట పెట్టిన పెట్టుబడితో ఆగిన వాళ్లు నష్టాలను చవిచూశారు. 2. లాంగ్‌టర్మ్‌ మంత్రం: దీర్ఘకాలిక ధృక్పథం, పోర్టుఫోలియోలో వైవిధ్యత ఉన్న మదుపరులే ముందుంటారని ఈ

78 కౌంటర్లలో ఎంఎసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌

Saturday 29th December 2018

గతవారం ముగింపు ప్రకారం 78 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఎన్‌సీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, అదానీ పోర్ట్స్‌, జీఎస్‌ఎఫ్‌సీ, వొక్‌హార్ట్‌, గ్రాసిమ్‌, టెక్‌మహీంద్రా, టాటా ఎలాక్సి, మైండ్‌ట్రీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను

Most from this category