News


రివర్స్‌ గేర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు

Saturday 19th October 2019
news_main1571459843.png-29000

  • సెప్టెంబర్‌లో 20% తగ్గుదల

న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు 20.1 శాతం తగ్గినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. సెప్టెంబర్‌ అమ్మకాలు 1,57,972 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదేకాలంలో నమోదైన 1,97,653 యూనిట్లతో పోల్చితే ఈ మేరుకు తగ్గుదల ఉన్నట్లు వివరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగల సీజన్‌ ఆఫర్లను కంపెనీలు ప్రకటించినప్పటికీ.. ఆశించిన స్థాయి ఫలితం లేకపోయిందని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే అన్నారు. పలు ప్రాంతాలలో కొనసాగుతున్న భారీ వర్షాలు అమ్మకాలు నెమ్మదించేలా చేశాయని, ప్రభుత్వం ప్రకటించిన సానుకూల అంశాల పూర్తి ప్రభావం సెప్టెంబర్ నెలలో రిటైల్ స్థాయిలలో ఇప్పటికీ కనిపించలేదని వ్యాఖ్యానించారు. గతేడాది పండుగ సీజన్‌లో ప్రారంభమైన అధిక ఇన్వెంటరీ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారయన. మందగమనం కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్య వాహన ఇన్వెంటరీలో మాత్రం మెరుగుదల ఉందన్నారు. 

ద్విచక్ర వాహన అమ్మకాలు 12.1 శాతం డౌన్‌
సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 10,98,271 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదే నెల్లో 12,48,998 యూనిట్లుగా నిలిచాయి. ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహన విక్రయాలు 63,518 యూనిట్లు (18.5 శాతం తగ్గుదల), త్రిచక్ర వాహనాల అమ్మకాలు 55,553 యూనిట్లు (1.8 శాతం వృద్ధి)గా ఎఫ్‌ఏడీఏ ప్రకటించింది. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 13,75,314 యూనిట్లు నమోదుకాగా 12.9 శాతం తగ్గుదల ఉన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 1,461 ఆర్‌టీఓలు ఉండగా.. వీటిలో నుంచి 1,188 వద్ద నుంచి సమాచారాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. 



You may be interested

12,000 స్థాయికి నిఫ్టీ, టాప్‌ స్టాక్‌ సిఫార్సులు!

Saturday 19th October 2019

-కొటక్‌ సెక్యురిటీస్‌, శ్రీకాంత్‌ చౌహాన్‌ తాజాగా మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే నిఫ్టీ 11,800, 12,000 స్థాయిల వద్ద గరిష్ఠాలను ఏర్పరిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని కోటక్‌ సెక్యురిటీస్‌, సాంకేతిక విశ్లేషకులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. మార్కెట్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగుతుంది... గరిష్ఠ స్థాయిలయిన 12,103, 11,981, 11, 695 స్థాయిలను కలుపుతున్న ‘పడుతున్న ట్రెండ్‌ లైన్‌’ను తాజాగా నిఫ్టీ క్రాస్‌

ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.308 కోట్ల లాభం

Saturday 19th October 2019

న్యూఢిల్లీ:  ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.308 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.2,739 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,571 కోట్లు, నికర లాభం రూ.293 కోట్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఒక్కో షేరుకు రూ.3.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ప్రస్తుత ఆర్థిక

Most from this category