News


బలహీన డిమాండ్‌తో వృద్థికి అడ్డంకులు

Saturday 17th August 2019
news_main1566017471.png-27822

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ బలహీన డిమాండ్‌, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ విధానం బదిలీ కాకపోవడం రెండు అతిపెద్ద సవాళ్లని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ పేర్కొంది. 2010-2014 మద్య జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 7.3 శాతానికి పెరగ్గా, సగటు ద్రవ్యోల్బణం 10 శాతం నుంచి 5 శాతానికి క్షీణించింది. ‘‘వృద్ధి రేటు బలంగా ఉన్నా కానీ, మొత్తం మీద పెట్టుబడుల వాతావరణం చాలా బలహీనంగా ఉంది’’ అని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రాచి మిశ్రా తెలిపారు. బడా ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు, మార్కెట్‌ భాగస్వాములు, బ్యాంకర్లు, రాజకీయ విశ్లేషకులతో ముంబై, ఢిల్లీలో గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సమావేశాలు నిర్వహించగా.. ఆర్‌బీఐ మానిటరీ విధానం బదిలీ కాకపోవడం, జీఎస్టీ వసూళ్లు నిదానంగా ఉండడాన్ని అందులో భాగంగా వారు వ్యక్తపరిచారు. ‘‘బలహీన డిమాండ్‌, మానిటరీ విదానం బదిలీ కాకపోవడం, జీఎస్టీ వసూళ్లు నిదానంగా ఉండడం భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ పెద్ద సవాళ్లుగా కొనసాగుతున్నాయి’’ అని ప్రాచి మిశ్రా పేర్కొన్నారు. ఈ దశాబ్ద కాలంలో భారత సగటు జీడీపీ 7 శాతంగా ఉంటుందన్నారు. ఇందులో నాలుగింట మూడో వంతు వినియోగానికి సంబంధించినదేనని, ఒక వంతు పెట్టుబడులకు సంబంధించినదిగా తెలిపారు. భారత్‌ ముఖ్యంగా భూమి, కార్మిక, ఎగుమతుల పరోత్సాహకం, ప్రైవేటీకరణ విషయంలో విప్లవాత్మక సంస్కరణల పట్ల భారత ప్రభుత్వం సుముఖంగా ఉందా అన్న ఆందోళనను తమ క్లయింట్లు వ్యక్తం చేసినట్టు చెప్పారు. 



You may be interested

భారత్‌కు మళ్లీ వస్తాం..!

Saturday 17th August 2019

ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ తిరిగి ప్రవేశిస్తున్న టీవీ కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్లదీ అదే దారి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్‌ కంపెనీలకు భారత మార్కెట్‌ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్‌, స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్‌

బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి

Saturday 17th August 2019

శాఖల స్థాయిలో అధికారులతో సంప్రదింపులు ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్‌ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఓ నెల రోజుల

Most from this category