News


ఫ్లిప్‌కార్ట్ ఇండియాలోకి రూ.1,431 కోట్లు

Friday 18th January 2019
news_main1547791176.png-23660

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా తాజాగా రూ. 1,431 కోట్లు సమీకరించింది. సింగపూర్‌కి చెందిన మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలియజేసింది. ఈ నిధులకు ప్రతిగా మాతృ సంస్థకు 4.86 లక్షల షేర్లు కేటాయించామని, ఒక్కో షేరు ధరను రూ. 29,400గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ రూ.2,190 కోట్లు పెట్టుబడి పెట్టింది. విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ సంస్థల నిబంధనలను కేంద్రం కఠినతరం చేసిన తరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఇండియాలోకి ఈ పెట్టుబడులు రావడం గమనార్హం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలకు గడువును పొడిగించాలంటూ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేంద్రాన్ని ఇప్పటికే కోరాయి.



You may be interested

రూ.8,800 కోట్లు సమీకరించిన ఎస్‌బీఐ

Friday 18th January 2019

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విదేశీ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సమీకరించింది. విదేశీ మార్కెట్లో బాం‍డ్ల జారీ ద్వారా రూ.8,800 కోట్లు (125 కోట్ల డాలర్లు) సమీకరించామని ఎస్‌బీఐ తెలిపింది. వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులు వినియోగిస్తామని పేర్కొంది. 85 కోట్ల డాలర్ల విలువైన ఐదేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ రేట్‌ అన్‌సెక్యూర్డ్‌ బాండ్లను రెండు దఫాలుగా జారీ చేశామని, వీటి కూపన్‌ రేట్‌

ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Friday 18th January 2019

క్యు3 ఫలితాలు అదరగొట్టిన ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. అన్ని విభాగాల్లో అదరగొట్టే ప్రదర్శన చూపింది. పెట్రోకెమికల్‌ విభాగంలో మాత్రం కొంత వెనుకంజ కనిపించింది. రిటైల్‌ విభాగపు ప్రదర్శన చాలా బాగుంది. పెట్రోకెమికల్‌ విభాగపు పేలవ ప్రదర్శనను ఇతర విభాగాలు భర్తీ చేశాయి. టవర్‌ వ్యాపారానికి సంబంధించిన డీల్‌ను జియో ఈ ఏడాది ప్రథమార్ధంలో పూర్తి చేయవచ్చని అంచనా. రిటైల్‌ ఎర్నింగ్స్‌

Most from this category