News


స్నేహపూర్వక పన్ను వ్యవస్థను సృష్టించాలి

Saturday 9th November 2019
news_main1573270304.png-29466

  • పన్నుల శాఖ అధికారులకు
  • ఆర్థికమంత్రి సూచన

ఫరీదాబాద్‌: స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు బాటన సాగాలని పన్నుల శాఖ అధికారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రభుత్వానికి-పన్ను చెల్లింపుదారులకు మధ్య అనుసంధానకర్తలుగా తగిన సౌలభ్యత రూపకర్తలుగా వ్యవహరించాలని రెవెన్యూ ఇంటెలిజన్స్‌ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపులకు సంబంధించి చెల్లింపుదారులు ఏ అంశంలోనూ భయాందోళనలకు గురికాని పరిస్థితి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇక్కడి నేషనల్‌ అకాడమీలో జరిగిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌-ఐఆర్‌ఎస్‌ (కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్)  69వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- గడచిన కొద్ది నెలల్లో నేను దేశ వ్యాప్తంగా పర్యటించి పన్ను శాఖ అధికారులతో సమావేశమయ్యాను. ప్రభుత్వానికి-పన్ను చెల్లింపుదారులకు మధ్య అనుసంధానకర్తలుగా తగిన సౌలభ్యత రూపకర్తలుగా వ్యవహరించాలన్నదే వారికి నా సందేశం.
-  పన్ను అధికారుల్లో ఒకరిద్దరి దుందుడుకు ప్రవర్తన మొత్తం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పన్నుల శాఖ అధికారులతో వ్యవహారం క్లిష్టమైనదని ప్రజలు భావించే పరిస్థితి తలెత్తుతోంది. 
- పన్ను చెల్లింపుల ప్రాముఖ్యత గురించి ప్రజలను చైతన్య వంతులను చేయడంలో కొత్త అధికారుల పాత్ర ఎంతో కీలకమైనది. 
- వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆరుగురు ట్రైనీ అధికారులకు ఈ సందర్భంగా ఆర్థికమంత్రి మెడల్స్‌ ప్రదానం చేశారు. మొత్తంగా మంచి పనితీరు కనబరిచిన మిషాల్‌ క్వైనీ డీకోస్టాకు ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ గోల్డ్‌ మెడల్‌ లభించింది.  



You may be interested

గెయిల్‌ ఇండియా టర్నోవర్‌ రూ.18,010 కోట్లు

Saturday 9th November 2019

35 శాతం తగ్గిన నికర లాభం  తగ్గిన మార్జిన్లు, ధరల ప్రభావం  న్యూఢిల్లీ:- ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 35 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,789 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,168 కోట్లకు తగ్గిందని గెయిల్‌ ఇండియా తెలిపింది. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గడం, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల నికర

అమెజాన్‌ ‘కళా హాత్‌’లో 280 రకాల ఉత్పత్తులు

Saturday 9th November 2019

2020 చివరికి 500కు చేరుస్తాం ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ తన పోర్టల్‌లో ‘కళా హాత్‌’ పేరిట నిర్వహిస్తున్న స్టోర్‌లో 280 రకాల కళారూపాల తాలూకు ఉత్పత్తులు నమోదయ్యాయని ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వరగంటి చెప్పారు. 2020 చివరి నాటికి 500 రకాల కళారూపాలను ఈ-కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారాయన. కాటమరాన్‌ వెంచర్స్‌, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌...

Most from this category