News


రిటర్నుల ఈ-అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Saturday 14th September 2019
news_main1568436393.png-28370

న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్‌ 8) నుంచి ఎలక్ట్రానిక్‌ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ-అసెస్‌మెంట్‌)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక శాఖా శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయింలో అ-అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్‌మెంట్‌కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖా అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై ఏవైనా తెలియజేయదలిస్తే, అందుకు అనుమతిస్తామని పేర్కొంది. పన్ను రిటర్నుల మదింపునకు సంబంధించి ఈ అసెస్‌మెంట్‌ కేంద్రం నోటీసులు జారీ చేస్తే, దీనికి సంబంధించి 15 రోజుల్లోపు స్పందన తెలియజేసిన కేసులను అసెసింగ్‌ అధికారికి ఆటోమేటిగ్గా బదిలీ చేయడం జరుగుతుందని తెలిపింది. 



You may be interested

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

Saturday 14th September 2019

ఉక్కునగరం (గాజువాక) : ప్రభుత్వ రంగ సంస‍్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో రూ. 96.71 కోట్ల నికర లాభం ఆర్జించింది.  శుక్రవారం జరిగిన సంస‍్థ 37వ ఏజీఎంలో కంపెనీ  సీఎండి పి.కె.రథ్‌  ఈ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రూ. 20,844 కోట్ల టర్నోవర్‌ సాధించి మార్కెట్‌లో 8.80 శాతం వాటాతో అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఆ ఏడాది వడ్డీలు, పన్నులు,

అంచనా కంటే భారత జీడీపీ వృద్ధి మరింత బలహీనం

Saturday 14th September 2019

ఐఎంఎఫ్ ప్రకటన వాషింగ్టన్‌: అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. కార్పొరేట్‌, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో దీర్ఘకాలం పాటు బలహీనతలే తన తాజా అంచనాలకు కారణాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. 2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల

Most from this category