News


ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీపై జీ- 20 దేశాల దృష్టి

Thursday 27th June 2019
news_main1561619103.png-26612

లండన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్‌బుక్ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్‌బుక్ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది పనిచేయాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ గవర్నర్‌ ఫ్రాంకోయిస్ విల్రాయ్‌ డి గాల్‌ చెప్పారు. ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీకి అనుమతులివ్వడం అంత ఆషామాషీ కాదని, నియంత్రణ సంస్థలతో చర్చించకుండా దీన్ని ప్రవేశపెట్టడం కుదరదని ఇంగ్లండ్‌కి చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రాధికార సంస్థ చీఫ్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. ఈ వారాంతంలో జీ20 దేశాల నేతలు జపాన్‌లో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
బ్యాంకింగ్‌ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే లిబ్రా కాయిన్స్‌ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని ఫేస్‌బుక్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో లావాదేవీల వ్యయాలు గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని ఫేస్‌బుక్ చెబుతోంది. కంపెనీకి రెండు వందల కోట్ల పైగా యూజర్లు ఉండటంతో ఆర్థిక లావాదేవీలపై ఇది గణనీయ ప్రభావం చూపించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, క్రిప్టో కరెన్సీల భద్రతపై సందేహాలుండటం, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వీటిని నిషేధించడం కారణంగా ఫేస్‌బుక్ లిబ్రా కాయిన్‌ చర్చనీయాంశమయింది.You may be interested

గూగుల్‌పై ఫ్రాన్స్‌లో దావా

Thursday 27th June 2019

డేటా భద్రత చట్టాలు ఉల్లంఘించినందుకే? ప్యారిస్‌: అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. కఠినతరమైన యూరోపియన్ యూనియన్ డేటా భద్రత చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపై వినియోగదారుల హక్కుల సంస్థ యూఎఫ్‌సీ-క్యూ కొయిసర్‌ గ్రూప్‌ ఈ దావా వేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫోన్లు, ట్యాబ్‌లు మొదలైన డివైజ్‌లను ఉపయోగించే యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్‌ మోసపూరితంగా

బడ్జెట్‌ నేపథ్యంలో క్యాలెండర్‌ కాల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 27th June 2019

 నిపుణుల సలహా బడ్జెట్‌ వారం వీక్లీ నిఫ్టీ ఆప్షన్లలో క్యాలెండర్‌ కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా మంచి రాబడి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో కొంచెం దూరం స్రై‍్టక్‌ప్రైస్‌లోని రెండు కాల్స్‌ను విక్రయించి వాటి దిగువ స్ట్రైక్‌ ప్రైస్‌కు చెందిన మరసటి వారం కాల్‌ను కొనుగోలు చేయడం జరుగుతుంది. బడ్జెట్‌ వేళ ఇది మంచి వ్యూహమని, బడ్జెట్‌కు ముందు నిఫ్టీ 12150 పాయింట్లను దాటదన్న అంచనాతో ఈ

Most from this category