News


ఫేస్‌బుక్‌ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ

Tuesday 18th June 2019
news_main1560837359.png-26371

  • రూపకల్పనకు లిబ్రా పేరిట కన్సార్షియం
  • వీసా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్‌తో జట్టు

లండన్‌: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వీసా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్, ఉబెర్ వంటి డజను పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. వెంచర్‌ క్యాపిటలిస్టులు, టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో పాటు ఈ కంపెనీలు ఒక్కొక్కటి కనీసం 10 మిలియన్ డాలర్లు ఈ కన్సార్షియంలో ఇన్వెస్ట్ చేస్తాయి. 
బిట్‌కాయిన్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా నియంత్రించడం, డాలరు, యూరో వంటి కీలకమైన కరెన్సీలకు మారకం విలువను అనుసంధానించడం ద్వారా ప్రజల్లో బిట్‌కాయిన్‌లపై విశ్వాసం పెంపొందించేందుకు తీసుకోతగిన చర్యలపై ఈ ప్రాజెక్టు దృష్టి పెట్టనుంది. దీని కోసం ఫేస్‌బుక్ ఇప్పటికే అమెరికా ఆర్థిక శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ మొదలైన వాటి నుంచి సహకారం కోరింది. సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ మొదలైనవి) సామాన్య ప్రజానీకం భారీగా నష్టపోయే ప్రమాదముందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫేస్‌బుక్‌ నుంచి క్రిప్టోకరెన్సీ వస్తోందన్న వార్తల నేపథ్యంలో బిట్‌కాయిన్‌ రేటు గణనీయంగా పెరిగింది. 2018 మే తర్వాత తొలిసారిగా 9,000 డాలర్ల స్థాయి పైకి చేరింది. You may be interested

వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండవసారి బ్రేక్‌లు!

Tuesday 18th June 2019

 2019-2020లో   జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతమే - ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి స్పీడ్‌    అంచనాకు కోత ఇది రెండవసారి - ఇంతక్రితం 7 శాతం నుంచి   6.8 శాతానికి కుదింపు - తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు నేపథ్యం న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ వరుసగా రెండవసారి కుదించింది. 2019- 2020లో కేవలం 6.6 శాతమే నమోదవుతుందని

జెట్‌ పునరుద్ధరణ ఇక కలే!

Tuesday 18th June 2019

 వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ వేటలో బ్యాంకులు ఫెయిల్‌ దివాలా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి బ్యాంకుల ఏకగ్రీవ నిర్ణయం వచ్చిన ఏకైక బిడ్‌... ఆమోదయోగ్యంగా లేదని ప్రకటన ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్‌ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్‌లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్‌ను విక్రయించడం ఇష్టం

Most from this category