News


టెక్‌ స్టార్ట్‌అప్స్‌లో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు

Saturday 28th September 2019
news_main1569645860.png-28595

- తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో పెట్టుబడి
- మరిన్ని స్టార్ట్‌అప్స్‌ను అన్వేషిస్తున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. దేశీ టెక్నాలజీ స్టార్ట్‌అప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో తన తొలి పెట్టుబడిని పెట్టిన ఈ సంస్థ.. మరిన్ని స్టార్ట్‌అప్స్‌లో పెట్టుబడుల పరంపరాను కొనసాగించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని సంస్థ భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు. శుక్రవారం కేరళలో జరిగిన ఆసియాలోని అతిపెద్ద స్టార్ట్‌అప్స్‌ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇక్కడి టెక్నాలజీ సంబంధిత అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సుముఖంగా ఉన్నామని, ప్రత్యక్ష పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇంటర్‌నెట్ అండ్‌ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) భాగస్వామ్యంతో కేరళ స్టార్ట్‌అప్‌ మిషన్ నిర్వహించిన ‘హడిల్ కేరళ-2019’ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ కొనసాగిన మీషో స్టార్ట్‌అప్‌ వ్యాపార మోడల్‌ తమను ఆకట్టుకున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. 

దేశంలో 22,895 అంకుర సంస్థలు...
ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి దేశంలో మొత్తం 22,895 స్టార్ట్‌అప్స్‌ నమోదైనట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. వీటిలో 45 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి నమోదైనట్లు తెలిపారు. మహిళలు స్థాపించిన సంస్థల వాటా 9-10 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. You may be interested

పండుగల సీజన్‌లో ‘మారుతీ’ బంపర్‌ ఆఫర్‌

Saturday 28th September 2019

బాలెనో మోడల్‌ కారుపై రూ. లక్ష తగ్గింపు న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్‌ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ

రాజీ లేని నాణ్యత వల్లే ఈ స్థాయి

Saturday 28th September 2019

పదేళ్లలోనే భారతీ సిమెంట్‌కు అగ్రస్థాయి సంస్థ ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి వ్యాఖ్యలు నల్లలింగాయపల్లె (కమలాపురం): వినియోగదారుల ఆశీర్వాదాలే వ్యాపారానికి పునాదులని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో బీసీసీపీఎల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీపీఎల్‌ భాగస్వామ్య సంస్థ వికా (ఫ్రాన్స్‌)

Most from this category