News


ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

Friday 20th March 2020
news_main1584676623.png-32585

- అదనంగా వెయ్యి డాలర్లు
- ఫేస్‌బుక్‌ వెల్లడి

 కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్‌ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్‌ వెల్లడించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదు. కానీ, వారి ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన పక్షంలో విధులకు హాజరు కాకపోయినా.. పూర్తి వేతనం లభిస్తుంది. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 2018లో 2,28,651 డాలర్లుగా ఉంది. "మీ కుటుంబాల గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకునేందుకు మీకు సమయం అవసరమన్న సంగతి సంస్థకు తెలుసు. వర్క్ ఫ్రం హోమ్‌ ప్రక్రియకు నివాసంలో ఏర్పాట్లు చేసుకోవడానికి అదనపు ఖర్చులు ఉంటాయి. అందుకే, ఉద్యోగులందరూ అదనంగా 1,000 డాలర్లు పొందవచ్చు" అని అధికారిక మెమోలోజూకర్‌బర్గ్ తెలిపారు. 
    అమెరికాలోని సియాటిల్‌లో ఫేస్‌బుక్ హెడ్‌ క్వార్టర్స్‌ ఉంది. ఓ కాంట్రాక్టరుకు కోవిడ్‌-19 బారిన పడినట్లు ధృవీకరణ కావడంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా ప్రాంతాల్లోని ఆఫీసులను ఆ తర్వాత మూసివేయడంతో చాలా మటుకు ఉద్యోగులు వారం రోజుల నుంచి .. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. 



You may be interested

టీవీఎస్ సీఎండీగా వేణు శ్రీనివాసన్‌

Friday 20th March 2020

 ప్రస్తుతం టీవీఎస్ మోటార్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఉన్న వేణు శ్రీనివాసన్‌ను పున:నియమించేందుకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఈయన సంస్థ సీఎండీగా మరో 5 ఏళ్లు కొనసాగనున్నారు. షేర్‌ హోల్డర్లు ఈయన్ను తిరిగి నియామించేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి వచ్చే 5 ఏళ్లు సీఎండీ పదవిలో ఉండనున్నారని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో

యస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రుణ సదుపాయం

Friday 20th March 2020

-అత్యవసరాల కోసం అందుబాటులో రూ. 60వేల కోట్లు - డిపాజిట్లపై ఖాతాదారులకు అడ్మినిస్ట్రేటర్ భరోసా  - చెల్లింపులకు తగినన్ని నిధులు ఉన్నాయని వెల్లడి మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్‌ బ్యాంక్‌కు ఇది

Most from this category