News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.242 కోట్ల నష్టాలు

Friday 18th October 2019
news_main1571374305.png-28972

  • క్యూ2 ఫలితాల ప్రకటన

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గృహ రుణాల సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. రూ.242 కోట్ల నష్టాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.431 కోట్ల లాభం కంపెనీకి రావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,154 కోట్లుగా ఉండగా, తాజాగా అది రూ.2,400 కోట్లకు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం రెండో భాగం నుంచి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. ‘‘2019 జూన్‌ 5న కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను డిఫాల్ట్‌ గ్రేడ్‌కు తగ్గించడం జరిగింది. దీంతో కంపెనీ నిధులు సమీకరించే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎటువంటి రుణాల జారీ లేకుండా నామమాత్రంగా కంపెనీ కొనసాగుతోంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ బాధ్యతలు రూ.48,826 కోట్లు. ఇది కంపెనీ మొత్తం రుణాల్లో 58 శాతం’’ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన ప్రకటనలో వివరించింది. 



You may be interested

పీవీఆర్‌ ఆదాయం రూ.979 కోట్లు

Friday 18th October 2019

37 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ చెయిన్‌,  పీవీఆర్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసిక కాలంలో రూ.49 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.35 కోట్లతో పోల్చితే 35 శాతం వృద్ది సాధించామని పీవీఆర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.715 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.979 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా

ఓలా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలు ప్రారంభం

Friday 18th October 2019

తొలుత బెంగళూరులో కార్లు త్వరలోనే హైదరాబాద్‌లో సేవలు న్యూఢిల్లీ: ట్యాక్సీ ఆగ్రిగేటర్‌ ఓలా.. తాజాగా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలను ప్రారంభించింది. ‘ఓలా డ్రైవ్‌’ పేరిట తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ప్లే ప్లాట్‌ఫాంకు అనుసంధానమైన ఈ కార్లలో 24/7 హెల్ప్‌లైన్, అత్యవసర బటన్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. రెండు గంటల పాటు కారును పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్

Most from this category