News


రెండవ నెలలోనూ ఎగుమతులు మైనస్‌

Wednesday 16th October 2019
news_main1571198687.png-28914

  • సెప్టెంబర్‌లో -6.57 శాతం క్షీణత

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా రెండవ నెల- సెప్టెంబర్‌లోనూ నిరాశను మిగిల్చాయి. వృద్ధిలేకపోగా -6.57 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో 26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఇక దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, దిగుమతులూ క్షీణతలో కొనసాగుతున్నాయి. - 13.85 శాతం క్షీణతతో 36.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 10.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన ఏడు నెలల్లో ఇంత తక్కువ వాణిజ్యలోటు ఇదే తొలిసారి.  పెట్రోలియం, ఇంజనీరింగ్‌, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పడిపోయాయి. మరోవైపు పసిడి దిగుమతుల విలువ 62.49 శాతం క్షీణించి 1.36 బిలియన్‌  డాలర్లుగా నమోదయ్యింది. ఇదిలావుండగా, భారత్‌ సేవల ఎగుమతులు ఆగస్టులో 10 శాతం పెరిగి 18.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు 16 శాతం పెరిగి, 12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 



You may be interested

అమెరికాతో వాణిజ్య వివాదాల్లేవు

Wednesday 16th October 2019

ఉన్నది కొన్ని అభిప్రాయ భేదాలే ఱైల్వేలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ: అమెరికాతో భారత్‌కు ఎటువంటి వాణిజ్య వివాదాల్లేవని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఉన్నది కేవలం కొన్ని అభిప్రాయ భేదాలేనన్నారు. ఇరు దేశాలు గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కలిగి ఉ‍న్నాయని చెప్పారు. భారత ఇంధన సదస్సులో మంత్రివర్గ ప్యానెల్‌ చర్చ సందర్భంగా గోయల్‌ మాట్లాడారు.

రూపీ 31 పైసలు డౌన్‌

Wednesday 16th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 5 పైసలు బలహీనపడి 71.59 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా మధ్య తాజాగా జరుగుతున్న పరిణామాల వలన డాలర్‌ కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో గత సెషన్‌లో 31 పైసలు బలహీనపడి 71.54 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అర శాతానికి పైగా పడిపోవడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో రూపీ పతనం తగ్గింది. యుఎస్‌-చైనా

Most from this category