News


పావు శాతం రేట్‌ కట్‌ పక్కా?!

Saturday 30th November 2019
news_main1575094340.png-29977

నిపుణుల అంచనా
డిసెంబర్‌ 3-5న జరిగే సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లను తగ్గించవచ్చని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క ద్రవ్యోల్బణం పెరగడం, మరోపక్క ఎకానమీలో మందగమనం... ఆర్‌బీఐకి విషమ పరీక్షగా మారతాయని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ది అంచనాలను ఆర్‌బీఐ స్వల్పంగా తగ్గించవచ్చన్నారు. ఈ దఫా కూడా రేట్లు తగ్గిస్తే ఏడాదిలో ఆరు మార్లు ఆర్‌బీఐ రేట్ల కోత విధించినట్లవుతుంది. అంతేకాకుండా వరుసగా ఎక్కువమార్లు రేట్లు తగ్గించిన రికార్డు సృష్టించినట్లవుతుంది. ఇప్పటివరకు ఆర్‌బీఐ ఈ ఏడాది 135 బీపీఎస్‌ మేర రేట్లను తగ్గించింది. రేట్లు తగ్గించడం ఒక ఎత్తైతే, తగ్గిన రేట్లను బ్యాంకులు కస్టమర్లకు సరఫరా చేయడం మరొక ఎత్తని, రెండో దశ(బ్యాంక్‌ టు కస్టమర్‌) మందకొడిగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్‌బీఐకి మరో పావు శాతం రేట్లు తగ్గించే వీలుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. బోఫా ఎంఎంల్‌ మాత్రం మరో 30 బీపీఎస్‌ రేట్‌కట్‌ ఉండొచ్చని, పండుగ డిమాండ్‌ బలహీనంగా ఉండడం ఆర్‌బీఐని మరింతగా రేట్లు తగ్గించేందుకు ప్రేరేపిస్తుందని తెలిపింది. ఇప్పటికే భారీగా రేట్లు తగ్గించినందున మరో రేట్‌కట్‌కు 50 శాతం మాత్రమే అవకాశం ఉంటుందని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. అదేవిధంగా 2019-20 జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. వృద్ది రేటు అంచనాను 5.6 శాతానికి పరిమితం చేసే ఛాన్సుందని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. అదేవిధంగా ద్రవ్యోల్బణ అంచనాను 3.4 శాతానికి పెంచవచ్చని అనలిస్టుల అభిప్రాయం. 



You may be interested

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ..విశ్లేషకులు ఏమంటున్నారు?

Saturday 30th November 2019

దేశ ఆర్థిక వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవ్వడం గమనార్హం. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. సెప్టెంబర్‌ త్రైమాసికానికిగాను దేశ ఆర్థిక డేటాపై వివిధ ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అభిప్రాయాలు.. అమర్‌ అంబాని, సీనియర్‌ ప్రైసిడెంట్‌

38,000పైన ముగిసిన పసిడి

Saturday 30th November 2019

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ధర 10డాలర్ల మేర లాభపడంతో శుక్రవారం ఎంసీఎక్స్‌ డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000 పైన ముగిసింది. రాత్రి ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌ ముగిసే సరికి పసిడి రూ.308లు లాభపడి రూ.38031.00 వద్ద స్థిరపడింది. హాంగ్‌కాంగ్‌లో చెలరేగిన రాజకీయ ఉద్రికత్తలతో అం‍తర్జాతీయంగా ఇతర కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఈ క్రమంలో దేశీయంగా ఎంసీఎక్స్‌లో  డాలర్‌

Most from this category