STOCKS

News


గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ

Thursday 26th December 2019
news_main1577330352.png-30443

- సత్వర పరిష్కారమార్గాలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్‌ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. వివాదాలను కనిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం థర్డ్ పార్టీ సర్వీసులను కూడా తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్‌ కోసం నిపుణుల కమిటీని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లడానికి కుదరదు. అయితే, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కార ప్రక్రియ వ్యవధిని పెంచుకోవచ్చు. నిర్దిష్టంగా చట్టపరమైన అంశాలు ఉంటే తప్ప ఆయా సంస్థల ఉద్యోగులు, ఉన్నతాధికారులే.. కమిటీ ముందు వాదనలు వినిపించవచ్చు. అడ్వకేట్లు, కన్సల్టెంట్ల పాత్రేమీ ఇ౾ందులో ఉండదు. 



You may be interested

నిఫ్టీ మద్దతు 12,183, అవరోధం 12,265

Thursday 26th December 2019

నామమాత్ర లాభంతో కదులుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 12,236 వద్ద ట్రేడవుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయలేదు. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లకు సైతం సెలవు. ఇక ప్రస్తుతం ఆసియాలో జపాన్‌, థాయ్‌లాండ్‌,  చైనా, ఇండొనేసియా 0.4-0.2 శాతం మధ్య​పుంజుకోగా.. కొరియా యథాతథంగా ట్రేడవుతోంది.

సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్‌

Thursday 26th December 2019

క్యూ3లో ఆఫీసు అద్దెల్లో 23 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్‌ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ క్యూ3–2019 ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది. బెంగళూరు తర్వాతే మెల్‌బోర్న్, బ్యాంకాక్‌.. 2019 క్యూ3లో ఆఫీస్‌ రెంట్స్‌ వృద్ధిలో

Most from this category