News


కరోనాకు బీమా కవరేజ్‌ ఉంది

Friday 6th March 2020
news_main1583475771.png-32326

  • అధికారికంగా ప్రకటించిన కౌన్సిల్‌

ముంబై: సాధారణ బీమా పాలసీలకు కరోనా వైరస్ (కోవిడ్ –19) కవరేజ్‌ ఉందని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. అంటువ్యాధులకు బీమా వర్తిస్తుందని, ఇందులో భాగంగానే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు సైతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుందని బీమా రంగంలోని 44 కంపెనీలను సభ్యులుగా కలిగి ఉన్న కౌన్సిల్‌ స్పష్టంచేసింది. ఈ అంశంపై చైర్మన్‌ ఏ.వీ గిరిజా కుమార్ మాట్లాడుతూ.. ‘దాదాపు మనుగడలో ఉన్న అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా కవరేజ్‌ ఉంది. ఈ విషయాన్ని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) బుధవారం ప్రకటించింది. కవరేజ్‌ వర్తింపజేయడం కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని, ఈ వ్యాధి కేసులకు త్వరితగతిన చికిత్స అందేలా చూడాలని పరిశ్రమను మాత్రమే ఐఆర్‌డీఏఐ కోరింది’ సాధారణ బీమా పాలసీల స్వీకరణలు పెరగాల్సిన అవసరం ఉందనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక అవగాహన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ @ రూ. 6

Friday 6th March 2020

90 శాతం కుప్పకూలిన షేరు రూ. 37 నుంచి రూ. 5.75కు పతనం 10 శాతం పతనంతో రూ. 33.15 వద్ద ఓపెనింగ్‌ తదుపరి లోయర్‌ సర్క్యూట్లను తాకిన షేరు వచ్చే నెల(ఏప్రిల్‌) 3 వరకూ ఖాతాదారులు రూ. 50,000కు మించి నగదును తీసుకునేందుకు వీలులేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ కట్టడి చేసిన వార్తలతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రారంభంలోనే 10 శాతం పతనమై రూ. 33.15 వద్ద ట్రేడింగ్‌

బ్యాంక్‌ విలీన షేర్ల మార్పిడి ఖారారు

Friday 6th March 2020

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు విలీనం ఈ నెలాఖరుకు పూర్తవ్వనున్నది. ఈ విలీనానికి సంబంధించి బ్యాంక్‌ షేర్ల మార్పిడి నిష్పత్తి గురువారం ఖరారైంది. వివరాలు... పీఎన్‌బీ షేర్ల మార్పిడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ)లు విలీనమవుతున్నాయి. ప్రతి వెయ్యి ఓబీసీ షేర్లకు గాను 1,150 పీఎన్‌బీ షేర్లను, ప్రతి వెయ్యి యూబీఐ షేర్లకు గాను 121 పీఎన్‌బీ షేర్లను కేటాయిస్తారు. రికార్డ్‌

Most from this category