News


పన్ను వివాదాలకు వేగవంతమైన పరిష్కారం చూపాలి

Saturday 25th January 2020
news_main1579921963.png-31183

  • అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరం
  • వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుంది
  • భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే

న్యూఢిల్లీ: పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని, వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే. దేశ వనరుల సమీకరణలో పన్నుల న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, పెండింగ్‌ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. దీనికి చీఫ్‌ జస్టిస్‌ హాజరై మాట్లాడారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్‌ కేసుల్లో 61 శాతాన్ని (1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. తేనెటీగలు పువ్వులకు హాని చేయకుండా మకరందాన్ని తోడుకున్నట్టుగానే, ప్రజల నుంచి పన్నులను రాబట్టాలని సూచించారు.
న్యాయ ప్రక్రియలోనూ ఏఐ...
న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ) అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ప్రస్తావించారు. ముఖ్యంగా వేగవంతమైన పరిష్కారం, ఒకే తరహా కేసుల పునరావృతం, డాక్యుమెంట్ల నిర్వహణలో ఏఐ అవసరపడుతుందన్నారు. అదే సమయలో ఏఐ అన్నది మానవ ప్రమేయాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్నారు. You may be interested

మందగమనం తాత్కాలికమే.. ఇకపై పురోగతి

Saturday 25th January 2020

భారత్‌ ఎకానమీపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా వ్యాఖ్య ముగిసిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన

మిస్త్రీ కేసులో టాటాలకు మరో ఊరట

Saturday 25th January 2020

ఆర్‌వోసీ పిటిషన్‌పై ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ ఉత్తర్వుకు సుప్రీం స్టే న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎస్)కు సుప్రీంకోర్టులో మరో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే... టీఎస్‌పీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ  డిసెంబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. టాటా సన్స్‌ను పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ-ముంబై)  మార్చడం ‘‘అక్రమం’’ అని తన రూలింగ్‌లో పేర్కొంది.  ‘‘ఆర్‌ఓసీ సహాయంతో’’

Most from this category