News


హైదరాబాద్‌ స్థలాన్ని విక్రయించిన ఎవరెడీ

Monday 2nd September 2019
news_main1567401623.png-28141

బ్యాటరీల తయారీలో ఉన్న బి.ఎమ్‌.ఖైతాన్‌ గ్రూప్‌ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌.. హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని న్యూలాండ్‌ టెక్నాలజీస్‌కు విక్రయించింది. డీల్‌ విలువ రూ.100 కోట్లు. మౌలాలి ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఇది నెలకొని ఉంది. విక్రయం ద్వారా వచ్చిన వనరులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఎండీ అమృతాంశు ఖైతాన్‌ వెల్లడించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ఇక్కడి ప్లాంటులో ఉత్పత్తి 2010 నుంచి నిలిచిపోయింది. అప్పులను తగ్గించుకోవడంలో భాగంగా 2018 డిసెంబరులో కంపెనీ చెన్నైలో ఉన్న స్థలాన్ని సైతం అమ్మింది. ఒలింపియా గ్రూప్‌ రూ.100 కోట్లకు దీనిని దక్కించుకుంది. 
రుణాలను తగ్గించుకోవడమే...
ఎవరెడీకి పలు చోట్ల స్థలాలు ఉన్నాయి. ‘కీలకం కాని ఆస్తుల విక్రయమంటే కంపెనీ రుణాలను తగ్గించడమే. ఇక ఇతర స్థలాలు, ఆస్తుల విక్రయం ఆలోచన ఇప్పట్లో లేదు’ అని అమృతాంశు పేర్కొన్నారు. 2018-19 తొలి త్రైమాసికంలో ఎవరెడీ రూ.50 కోట్ల రుణాలను చెల్లించిందని రేటింగ్స్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ వెల్లడించింది. కంపెనీ టెర్మ్‌ లోన్స్‌ రూ.301 కోట్లు ఉన్నాయి. ఫండ్‌ బేస్డ్‌ లిమిట్‌ రూ.160 కోట్లు, నాన్‌-ఫండ్‌ బేస్డ్‌ లిమిట్‌ రూ.120 కోట్లుగా ఉందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. నష్టాలు చవిచూస్తున్న టీ వ్యాపారాన్ని ఈ ఏడాది జూలైలో మధు జయంతి ఇంటర్నేషనల్‌కు ఎవరెడీ రూ.6 కోట్లకే విక్రయించింది. 



You may be interested

నష్టాల్లో ప్రారంభమైన అంతర్జాతీయ మార్కెట్లు

Monday 2nd September 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించికున్న తాజా టారిఫ్‌లు సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా సెప్టెంబర్‌ 2(సోమవారం) ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ ప్యూచర్‌ 1.06 శాతం నష్టపోగా, జపాన్‌ నికాయ్‌ 225 0.28 శాతం, ఎంఎస్‌సీఐ జపాన్‌ వెలుపల ఆసియా పసిఫిక్‌ షేర్స్‌ ఇండెక్స్‌ 0.3 శాతం  నష్టపోయాయి.

పాప కోసం.. ఏ ఫండ్‌ ?

Monday 2nd September 2019

ప్ర: నాకు నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్‌ చెయ్యాలనేది నా కల. ఆమె భవిష్యత్తు కోసం ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? సిప్‌ మొదలు పెట్టే ప్రక్రియ సంబంధిత వివరాలు తెలియజెయ్యండి ?  -రఘువీర్‌, హైదరాబాద్‌  జ: ఒక పాపకు తండ్రి అయినందుకు ముందుగా మీకు అభినందనలు. ఆమె భవిష్యత్తు కోసం సిప్‌ విధానంలో

Most from this category