News


వొడాఫోన్‌ ఐడియా మూసివేత ఖాయమా?

Friday 24th January 2020
news_main1579840299.png-31157

కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఉపశమనాలు ప్రకటించినా వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌)ను గట్టెక్కించలేవని, ఏ విధమైన ఫైనాన్షియల్‌ బెయిల్‌అవుట్స్‌ కూడా వీఐఎల్‌ను తిరిగి జియో, ఎయిర్‌టెల్‌తో పోటీలో నిలపలేవని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా వీఐఎల్‌ను బయటపడేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా గుర్తిస్తుందని డాయిష్‌బ్యాంక్‌ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో వీఐఎల్‌ను దివాలా తీయించి అనంతరం ఆస్తుల వేలం సమయంలో తిరిగి కొనుగోలు చేయవచ్చని ఆదిత్య బిర్లాగ్రూప్‌ భావించవచ్చని తెలిపింది. అయితే దివాలాకు వచ్చిన కంపెనీల ఆస్తులను తిరిగి అదే ప్రమోటర్లు కొనుగోలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో బిర్లా ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయో చెప్పలేమని పేర్కొంది. ఇలా స్వయం ప్రకటిత దివాలా కంపెనీలను ప్రమోటర్లు తిరిగి కొనుగోలు చేసే అంశంపై నిబంధనలు స్పష్టంగా లేవని పేర్కొంది. ఏజీఆర్‌ బకాయిల కింద వీఐఎల్‌ దాదాపు రూ. 53వేల కోట్లు చెల్లించాల్సిఉంది. ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ ఈ విషయంలో ఊరటనివ్వకపోతే కంపెనీ మూసివేయక తప్పదని బిర్లా గ్రూప్‌ ప్రకటిస్తోంది. వీఐఎల్‌ కొనసాగాలంటే భారీగా టారిఫ్‌లు పెంచడం, ప్రభుత్వం గట్టి ఊరటనందించడం, మార్కెట్‌ వాటా స్థిరంగా కొనసాగడమనేవి జరగాలని డాయిష్‌బ్యాంక్‌ తెలిపింది. వీటిలో రెండు అంశాలు ఫలించినా ప్రయోజనం ఉండదని, తప్పక మూడు అంశాలు జరిగితీరాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. జియో ఉధృతంగా చొచ్చుకుపోతున్న తరుణంలో మార్కెట్‌ వాటా నిలుపుకోవడం వీఐఎల్‌కు చేతకాకపోవచ్చని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. రాబోయే 5జీ వేలంలో జియో హవా కొనసాగుతుందని, వీఐఎల్‌ ఆర్థిక ఇబ్బందులు జియోకు కలిసివస్తాయని డాయిష్‌బ్యాంకు పేర్కొంది.



You may be interested

జెన్సార్‌-అదానీ గ్యాస్‌- పీఎన్‌బీ హౌసింగ్‌ ‘బేర్‌

Friday 24th January 2020

ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 41,487కు చేరగా.. నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 12,215 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఐటీ సేవల కంపెనీ జెన్సార్‌ టెక్నాలజీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో

వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల తగ్గింపు-కార్పొరేట్ల అంచనా

Friday 24th January 2020

రూ. 2.5 లక్షల పరిమితి పెంపు? కేపీఎంజీ సర్వే నివేదిక వెల్లడి వచ్చే నెల 1న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లలో కోత ఉండవచ్చని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపొందిస్తున్న బడ్జెట్‌పై ట్యాక్స్‌ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో ఇంకా మరిన్ని ఆశలు, అంచనాలు వెలువడ్డాయి. వివరాలు చూద్దాం.. మినహాయింపుల పెంపు? ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 2.5 లక్షల

Most from this category