News


ఈటో మోటార్స్‌ ‘ఎలక్ట్రిక్‌’ కార్గో రైడ్‌

Friday 15th November 2019
news_main1573789519.png-29604

  • ఏడాదిలో 4,000 ఎలక్ట్రిక్‌ కార్గో వాహనాలు
  • సరఫరా చేయనున్న చైనా కంపెనీ బీవైడీ

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ దిగ్గజం ‘బీవైడీ’.. ఇదే రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఈటో మోటార్స్‌తో  ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా బీవైడీ తయారీ టీ3 రకం ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్‌ కార్గో వాహనాలను ఈటో కొనుగోలు చేయనుంది. తొలుత 50 వాహనాలకు ఈటో మోటార్స్‌ ఆర్డరిచ్చింది. అలాగే పెద్ద ఎత్తున త్రీ, ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్‌ కార్గో వెహికిల్స్‌ను రంగంలోకి దింపనున్నారు. ఏడాదిలోగా 4,000 ఎలక్ట్రిక్‌ కార్గో వాహనాలను కొనుగోలు చేయనున్నట్టు ఈటో సీఈవో బిజు మాథ్యూస్‌ తెలిపారు. 20 నగరాల్లో వీటిని ప్రవేశపెడతామన్నారు. ఆన్‌లైన్‌ రంగ సంస్థలు, కార్గో కంపెనీలతోపాటు స్థానిక వర్తకుల రవాణా అవసరాల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలియజేశారు. 



You may be interested

పెట్టుబడులకు భారత్ బెస్ట్‌

Friday 15th November 2019

మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి భారత్‌లో అపరిమిత అవకాశాలున్నాయి బ్రిక్స్‌ బిజినెస్‌ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బ్రెజిలియా: పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. "2024 నాటికి భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యించుకుంది. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి.

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడగింపు

Friday 15th November 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను పరిధిలోని ట్యాక్స్‌ పేయర్లకు ఊరట లభించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–9) దాఖలు చేయడానికి గడువు తేదీలను కేంద్రం పొడిగించింది. 2017-18 రిటర్నులను దాఖలు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు తేదీ కాగా, 2018-19 రిటర్నుల చివరి తేదీ వచ్చే ఏడాది మార్చి 31గా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సమన్వయ నివేదిక (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌) దాఖలు తేదీల్లో కూడా మార్పులు చేసింది.

Most from this category