News


ఓపెన్‌ ఆఫర్‌ నుంచి మినహాయింపునివ్వాలి

Saturday 22nd June 2019
news_main1561177104.png-26489

  • స్లాట్స్‌పై హామీ కావాలి
  • జెట్‌ టేకోవర్‌కు ఎతిహాద్‌ డిమాండ్లు

ముంబై: రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేయాలంటే ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపునివ్వాలని, ఎయిర్‌పోర్టులలో స్లాట్స్‌పై హామీ ఇవ్వాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే, ఆయా మినహాయింపులపై హామీ ఇచ్చేందుకు తమకు అధికారాలేమీ లేవని పేర్కొంది.  జెట్ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గతేడాది కాలంగా సముచిత పరిష్కార మార్గం కోసం రుణదాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఎస్‌బీఐ శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఇందుకోసం సలహాదారులుగా ఎస్‌బీఐక్యాప్స్‌, మెకిన్సే వంటి పేరొందిన కన్సల్టెంట్లను కూడా నియమించుకున్నట్లు వివరించింది. అటుపైన కొత్త ఇన్వెస్టర్లను తీసుకొచ్చేందుకు బిడ్స్‌ ఆహ్వానించగా.. ఎతిహాద్‌, ఎన్‌ఐఐఎఫ్‌, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్‌ మొదలైనవి ఆసక్తి వ్యక్తీకరించినప్పటికీ.. బైండింగ్‌ బిడ్స్‌ రాలేదు. చివరికి ఇద్దరు రుణదాతలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించడంతో తాము కూడా అదే బాటలో ముందుకెడుతున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఏప్రిల్ 17న కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్.. బ్యాంకులకు దాదాపు రూ. 8,500 కోట్లు, ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు, వెండార్లకు దాదాపు రూ. 10,000 కోట్లు బాకీ పడిన సంగతి తెలిసిందే. You may be interested

రవాణా... రయ్‌..రయ్‌

Saturday 22nd June 2019

 15 లాజిస్టిక్‌ సంస్థలతో షిప్‌రాకెట్‌ ఒప్పందం 1.5 లక్షల మంది విక్రయదారుల నమోదు ఏటా 10 లక్షల డెలివరీ; రూ.348 కోట్ల జీఎంవీ త్వరలోనే పోస్టల్‌ విభాగంతో ఒప్పందం  ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సాహిల్‌ గోయల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిటైలర్, హోల్‌సేలర్ అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి విస్తరించాలని భావిస్తున్నారు. మెట్రో నగరాల్లో అయితే ఓకే.. ఎందుకంటే అందుబాటులో లాజిస్టిక్‌ కంపెనీ సేవలుంటాయి కాబట్టి! మరి, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారస్తులు

చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

Saturday 22nd June 2019

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరిక తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అకౌంటింగ్‌ సంస్థలకు సూచన తప్పు చేయని వారికి సమస్యలు ఉండవని భరోసా న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హితవు పలికారు. రౌండ్‌ ట్రిప్పింగ్‌ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో

Most from this category