News


1.2 శాతం పెరిగిన ఎస్కార్ట్‌ విక్రయాలు

Saturday 1st February 2020
news_main1580549884.png-31402

న్యూఢిల్లీ: జనవరి నెలలో వాహన విక్రయాలు 1.2 శాతం పెరిగాయని ఎస్కార్ట్స్‌ కంపెనీ ప్రకటించింది. ఈ జనవరిలో 6,063 ట్రాక్టర్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది జనవరిలో 5,991 ట్రాక్టర్లను మాత్రమే అమ్మినట్లు కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా దేశీయ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 1.4 శాతం పెరగడంతో 5,845 ట్రాక్టర్లను విక్రయించినట్లు పేర్కొంది. ఎగుమతులు 5 శాతం పడిపోవడంతో కేవలం 218 ట్రాక్టర్లను విక్రయించామని, గతేడాది ఈ సంఖ్య 229గా ఉందని తెలిపింది. కాగా  ఎస్కార్ట్స్‌ అగ్రి మెషినరీ, ఎస్కార్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, రైల్వే ఎక్విప్‌మెంట్‌ డివిజన్‌ వంటి విభాగాలో ఎస్కార్ట్స్‌ కంపెనీ వ్యాపారాన్ని విస్తరించింది.  



You may be interested

7 శాతం పెరిగిన ఎంఅండ్‌ఎం వాహన విక్రయాలు

Saturday 1st February 2020

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్ర(ఎంఅండ్‌ఎం) కంపెనీ వాహన విక్రయాలు 4 శాతం పెరిగాయని ప్రకటించింది. గతేడాది జనవరిలో 22,212 ట్రాక్టర్లను విక్రయించగా ఈ ఏడాది జనవరిలో 23,116 ట్రాక్టర్లను విక్రయించినట్లు అధికారికంగా వెల్లడించింది. దేశీయ వాహనాల విక్రయం 7 శాతం పెరగిందని, 22,329 యూనిట్లను విక్రయించనట్లు తెలిపింది. దిగుమతులు 38 శాతం తగ్గడంతో కేవలం 787 మాత్రమే విక్రయించామని పేర్కొంది. గతేడాది 1,264 ట్రాక్టర్లు అమ్మింది.   

11800 పాయింట్ల దిగువన నిఫ్టీ

Saturday 1st February 2020

దేశీయ స్టాక్‌ ఎక్చేంజ్‌లు బడ్జెట్‌ రోజు తీవ్ర నష్టాలోకి జారాయి. మార్కెట్‌ ఆశించినట్లు ఎల్‌టీసీజీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో సూచీలు భారీ నష్టాల్లోకి మరలాయి. నిఫ్టీ 11800 పాయింట్ల మద్దతు కోల్పోయి 11741 పాయింట్ల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్‌ దాదాపు 40వేల పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ మినహాయింపులు, ఎల్‌ఐసీ ఐపీఓ, డీడీటీ ఎత్తివేత లాంటివి మార్కెట్‌ను పెద్దగా రంజింపజేయలేకపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండడం

Most from this category