News


ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు తగ్గాయ్‌!

Thursday 5th March 2020
Markets_main1583403383.png-32307

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) ఖాతాదారులకు వడ్డీరేటును తగ్గించినట్లు చేదు వార్త చెప్పింది. ఒకేసారి 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఖాతాదారులకు వచ్చే వడ్డీ తగ్గనుంది. ప్రస్తుతం 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్‌​ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. తాజాగా తగ్గించిన వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరం అమలులో ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వల్ల  డెట్‌ మార్కెట్‌ సెక్యూరిటీల పెట్టుబడులపై ఆర్జనలు తగ్గడంతో వడ్డీరేటు తగ్గించి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఈపీఎఫ్‌ దాదాపు రూ.4,500 కోట్లను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌లలో పెట్టుబడులు పెట్టింది. డెట్‌ మార్కెట్లో 85శాతం, స్టాక్స్‌లో 15 శాతం ఈపీఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేసింది. 2019 మార్చి 31నాటికి ఈపీఎఫ్‌ మొత్తం రూ.74,324 కోట్లను ఇన్వెస్ట్‌ చేసి 14.74 శాతం రాబడిని పొందింది. ఈ పీఎఫ్‌ వడ్డీరేట్లను తగ్గించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2017-16లో 8.8 శాతం వడ్డీ ఉండేది. కానీ 2017-18 సంవత్సరంలో 8.55 శాతానికి వడ్డీని తగ్గించారు. ఆ తరువాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీనీ 8.65 శాతానికి పెంచారు. కాగా రూ.12 లక్షల కోట్ల నిధి నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌లో 6 లక్షల మంది క్రియాశీల ఖాతాదారులు ఉన్నారు. 



You may be interested

ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరి

Thursday 5th March 2020

సెన్సెక్స్‌ 61 పాయింట్లు ప్లస్‌ 18 పాయింట్లు బలపడిన నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ అప్‌ ప్రపంచ మార్కెట్లు జోరం‍దుకోవడంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 64 పాయింట్లు పెరిగి 38,471 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 11,269 వద్ద స్థిరపడింది. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమక్రటిక్‌ అభ్యర్థి జో బిజెన్‌ కొన్ని రాష్ట్రాలలో ముందంజ వేయడంతో బుధవారం

వచ్చే మార్చికల్లా 13500కు నిఫ్టీ!

Thursday 5th March 2020

కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ చర్యలతో కరోనాకు చెక్‌ విదేశీ పెట్టుబడులకు ధీటుగా దేశీ సిప్స్‌ కొటక్‌ సెక్యూరిటీస్‌ తాజా అంచనా ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​మరింత బలహీనపడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. అయితే వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మార్కెట్లు బాటమవుట్‌ అయ్యే అవకాశమున్నదని అభిప్రాయపడింది. కొటక్‌ సెక్యూరిటీస్‌ నివేదికలోని ఇతర అంశాలు

Most from this category