News


నిర్మా గ్రూప్‌ చేతికి ఇమామి సిమెంట్‌

Friday 7th February 2020
news_main1581044067.png-31577

  • డీల్‌ విలువ రూ.5,500 కోట్లు

 కోల్‌కత: ఇమామి గ్రూప్‌నకు చెందిన ఇమామి సిమెంట్‌ను నిర్మా గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. నిర్మా గ్రూప్‌నకు చెందిన న్యూవొకొ విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (గతంలో నిర్మా సిమెంట్‌) రూ.5,500 కోట్లకు ఇమామి సిమెంట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇమామి గ్రూప్‌ తెలిపింది. గ్రూప్‌ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఇమామి సిమెంట్‌లో వంద శాతం వాటా విక్రయించాలని ఇమామి నిర్ణయించుకుంది. 8 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ సిమెంట్‌ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, న్యువొకొ విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, లఫార్జే హోల్సిమ్‌ కంపెనీకి చెందిన కంపెనీ, స్టార్‌ సిమెంట్‌లు పోటీ పడ్డాయి. చివరకు నిర్మా గ్రూప్‌నకు దక్కింది. 



You may be interested

ఆధార్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్‌ కార్డ్‌!

Friday 7th February 2020

రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడి న్యూఢిల్లీ: పాన్‌ కార్డ్‌ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా సత్వరమే పాన్‌ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వైబ్‌ సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే నమోదిత మొబైల్‌కు వన్‌ టైం పాస్‌ వార్డ్‌ (ఓటీసీ) వస్తుందని, దీనిని

ఐటీ శాఖ నుంచి ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌

Friday 7th February 2020

న్యూఢిల్లీ: మినహాయింపులుండని కొత్త ట్యాక్స్ విధానంలోకి మారదల్చుకునేవారు ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఇన్‌కం ట్యాక్స్ శాఖ ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన https://www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్‌ మొదలైన వివరాలన్నీ

Most from this category