News


ఇమామిలో 10 శాతం వాటా అమ్మకం

Tuesday 25th June 2019
news_main1561438723.png-26549

  • రూ.1,230 కోట్లకు విక్రయించిన ప్రమోటర్లు

న్యూఢిల్లీ: ఇమామి కంపెనీ ప్రమోటర్లు ఆ కంపెనీలో మరో 10 శాతం వాటాను విక్రయించారు. ఈ వాటాను రూ.1,230 కోట్లకు సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించారని ఇమామి తెలియజేసింది. ఇమామి గ్రూప్‌ రుణభారం తగ్గించుకోవడానికి ఈ వాటా విక్రయం​జరిగిందని పేర్కొంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమోటర్లు 10 శాతం వాటాను రూ.1,600 కోట్లకు విక్రయించారు. తాజా వాటా విక్రయం అనంతరం ఇమామిలో ప్రమోటర్ల వాటా 52.74 శాతానికి తగ్గుతుంది. ఈ వాటాను ప్రమోటర్లు కొనసాగిస్తారని, మరింత వాటా విక్రయం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. 
రుణ భారం తగ్గించడానికే...
రుణ భారం తగ్గించుకోవడమే ప్రమోటర్ల ప్రాధాన్యతాంశమని ఇమామి గ్రూప్‌ డైరెక్టర్‌  ఆదిత్య అగర్వాల్‌ వెల్లడించారు. ఇమామి గ్రూప్‌ భవిష్యత్తు వృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యాపారంలోనూ, పరిశ్రమలోనూ తలెత్తుతున్న సమస్యలను అధిగమించడానికి ప్రమోటర్లు అంకిత భావంతో ప్రయత్నాలు చేస్తున్నారని ఇమామి కంపెనీ మరో డైరెక్టర్‌ మోహన్‌ గోయెంకా చెప్పారు. ఇమామి గ్రూప్‌ వాటాదారులకు మరింతగా ప్రయోజనం చేకూర్చేలా కంపెనీ ప్రమోటర్లు కృషి చేస్తున్నారన్నారు. 



You may be interested

ఆధార్‌ ప్రింట్‌ చేసినంత ఈజీ కాదు

Tuesday 25th June 2019

‘ఎలక్ట్రిక్‌’కు మారడంపై టీవీఎస్‌, బజాజ్‌ ఆటో విమర్శలు పూర్తి సప్లయ్‌ చెయిన్‌ను ఏర్పాటు చేయాలని సూచన నీతి ఆయోగ్‌ ప్రతిపాదన పట్ల అభ్యంతరం న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్‌ కార్డును ప్రింట్‌ చేసింత ఈజీ కాదని టీవీఎస్‌, బజాజ్‌ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత

మేలో మారుతీ సుజుకీ హవా

Tuesday 25th June 2019

టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ కార్లలో 8 మారుతీవే.. న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మేనెల విక్రయాల్లో దూసుకుపోయింది. ఇతర కంపెనీల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ.. పలు మారుతీ మోడళ్లు మాత్రం రికార్డు స్థాయి విక్రయాలను కొనసాగించాయి. భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో నమోదైన టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ కార్ల జాబితాలో 8 మారుతీవే ఉన్నాయి.

Most from this category