News


టెస్లా చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌

Friday 9th November 2018
news_main1541740093.png-21806

వాహింగ్టన్‌: ఎలక్ట్రిక్‌ కార్ల సంచలనం టెస్లా... తన కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌(55)ను నియమించింది. కొన్నాళ్లుగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాబిన్‌ డెన్‌హోమ్‌... ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద టెలికం కంపెనీ, టెల్‌స్ట్రాకు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని టెస్లా తెలిపింది. పబ్లిక్‌ హోల్డింగ్‌ కంపెనీగా అమెరికా స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్లకు షేరుకు 420 డాలర్లు చెల్లిస్తానని, అందుకు తగ్గ నిధులు కూడా ఉన్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న టెస్లా చైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడ్డాడని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్సే‍్ఛంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభిప్రాయపడింది. దీంతో చైర్మన్‌ పదవికి మస్క్‌ గత నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా ఖాళీ అయిన ఆయన పదవి ఇప్పుడు రాబిన్‌ డెన్‌హోమ్‌తో భర్తీ అయ్యింది.
నాలుగేళ్లుగా టెస్లా బోర్డులో...
2014 నుంచి టెస్లా డైరెక్టర్ల బోర్డ్‌లో రాబిన్‌ డెన్‌హోమ్‌ డైరెక్టరుగా ఉన్నారు. ‘‘టెల్‌స్ట్రా సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న ఆమె... 6 నెలల నోటీస్ పీరియడ్‌లో ఉన్నారు. ఈ కాలంలో టెస్లా చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతల నిర్వహణకు ఎలాన్‌ మస్క్‌ తగిన సహాయ సహకారాలు అందిస్తారు. టయోటా, సన్‌ మైక్రోసిస్టమ్స్‌, జునిపర్‌ నెట్‌వర్క్స్‌లో కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. టెక్నాలజీ, వాహన రంగాల్లో అపారమైన అనుభవం ఉంది’’ అని టెస్లా తెలియజేసింది. కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాన్‌కు, టెస్లా టీమ్‌కు తగిన తోడ్పాటునందిస్తానని రాబిన్‌ డెన్‌హోమ్‌ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను అందించడానికి కృష్టి చేస్తానన్నారు.
చైర్మన్‌ గిరీని పోగొట్టిన ట్వీట్‌...
టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు కొనుగోలు చేస్తానని, దానికి తగ్గ నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చేసినప్పుడు టెస్లా షేర్‌ 340 డాలర్ల వద్ద ఉంది. ఈ ట్వీట్‌తో అదేరోజు షేర్‌ ధర 380 డాలర్లపైకి చేరింది. నిజానికిలాంటి ప్రకటనలు ముందుగా ఎక్సే‍్ఛంజీలకు తెలియజేయాలి తప్ప నేరుగా ప్రకటించకూడదు. ఇది ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడటమేనని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. చివరకు మస్క్‌ వివరణ ఇవ్వటంతో మస్క్‌, టెస్లా కంపెనీలపై చెరో 2 కోట్ల డాలర్ల జరిమానా వేసింది. సీఈఓగా కొనసాగడానికి ఓకే చేసి... చైర్మన్‌ పదవిని వదులుకోవాలని స్పష్టంచేసింది.You may be interested

స్మార్ట్‌ టీవీలదే హవా

Friday 9th November 2018

న్యూఢిల్లీ: స్మార్ట్‌ హంగులతో ఉన్న టెలివిజన్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. అక్టోబర్లో దేశవ్యాప్తంగా జరిగిన టీవీల అమ్మకాల్లో 55 శాతం వాటా స్మార్ట్‌ టీవీలదే. పెద్ద పట్టణాల్లో అయితే స్మార్ట్‌ టీవీల విక్రయాలు 65 శాతం. క్రితం ఏడాది ఇదే మాసంలో స్మార్ట్‌ టీవీల అమ్మకాలు 45 శాతంగానే ఉండడం గమనార్హం. ఇంటర్నెట్‌తో అనుసంధానమనేది స్మార్ట్‌ టీవీకి అదనపు ఆకర్షణగా మారింది. బ్రాడ్‌ బ్యాండ్‌ అందుబాటు ధరల్లోకి రావడం స్మార్ట్‌

రూపీ అప్‌..

Friday 9th November 2018

క్రూడ్‌ ధరలు తగ్గడం, లిక్విడిటీకి మద్దతునిచ్చేందుకు ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా బాండ్లను కొనుగోలు చేయడం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వంటి అంశాల కారణంగా రూపాయి శుక్రవారం బలపడింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 73.01తో పోలిస్తే 0.46 శాతం లాభపడింది. ఇక రూపాయి శుక్రవారం 72.71 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.767 శాతంగా

Most from this category