News


శ్రీసిటీని సందర్శించిన ఈఎంసీ బృందం

Wednesday 26th February 2020
news_main1582687279.png-32097

వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌ఎస్‌సీ) సీఈఓ మహాపాత్ర శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.  శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ఆయనకు వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో భాగంగా ఇక్కడ ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ పరిశ్రమల గురించి  మహాపాత్ర తెలుసుకున్నారు.  సువిశాల పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక వసతుతో  పాటు వేలాది ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు శ్రీసిటీలోని ఈఎంసీలోని ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్స్‌లో వ్యాపార అవకాశాలను అంచనా వేయడంలో తమ పర్యటన ఉద్ధేశ్యంగా మహాపాత్ర తెలిపారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. మహాపాత్ర పర్యటన తమకెంతో ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. 



You may be interested

సెన్సెక్స్‌ 350 పాయింట్లు క్రాష్‌..!

Wednesday 26th February 2020

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ అంటువ్యాధి భయాలు మరింత ఉధృతమవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 40,000 దిగువన 39931.20 నిఫ్టీ 100 పాయింట్ల 11,700 వద్ద మొదలయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా తమ దేశ ప్రజలను హెచ్చరించడంతో మంగళవారం రాత్రి ఈ దేశ ఈక్విటీ మార్కెట్లు 3శాతం నష్టాన్ని

నేడు గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌?!

Wednesday 26th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 89 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,757 వద్ద తొలి సపోర్ట్‌! యూఎస్‌ మార్కెట్లు 3 శాతం పతనం  నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 89 పాయింట్లు పతనమై 11,745 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,834 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే

Most from this category