News


ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

Saturday 3rd August 2019
news_main1564810754.png-27520

  • బిజినెస్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మేకపాటి
  • యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక తర్ఫీదు

రేణిగుంట (చిత్తూరు జిల్లా) : ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బిజినెస్‌ సెంటర్‌ నూతన భవనాన్ని ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలసి ప్రారంభించారు. వింగ్‌టెక్‌ సారథ్యంలో నడుస్తున్న సెల్‌కాన్‌ ఫెసిలిటీలో సెల్‌ఫోన్లు, చార్జర్ల తయారీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. కార్బన్‌ కంపెనీని పరిశీలించారు. ఇప్పటికే 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు, రెండో యూనిట్‌ పూర్తయితే మరో 7 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు మాలిక్, నాగేంద్ర మంత్రికి తెలిపారు.
డిక్సన్‌ ఫేజ్‌-2 ప్రారంభం...
 ఈఎంసీ–2లో నిర్మాణంలో ఉన్న సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్కును మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. డిక్సన్‌ కంపెనీ ఫేజ్‌–2 కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.  వివిధ  కంపెనీల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు మంత్రి చెప్పారు. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న యువతకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ నైపుణ్య సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  పరిశ్రమల స్థాపనకు భూములిచ్చిన వారికి ఉద్యోగాల కల్పనలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. You may be interested

ఇంధన కంపెనీలకు నిధుల సమస్య లేదు

Saturday 3rd August 2019

విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగానే భారత ఇంధనరంగం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఇంధన కంపెనీలు నిధుల సమీకరణ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. కొన్ని సౌర్వభౌమ ఫండ్స్‌, నార్వే పెన్షన్‌ ఫండ్‌ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేయరాదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘అక్కడ ఎటువంటి సవాళ్లు లేవు. పెన్షన్‌ ఫండ్స్‌

హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌

Saturday 3rd August 2019

పాఠ్యాంశాలతో పాటూ స్కిల్స్, లాంగ్వెజెస్‌ ట్రెయినింగ్‌ 17 వేల సబ్జెక్ట్స్‌; 7 వేల మంది టీచర్ల నమోదు ఏడాదిలో 5 లక్షల మంది స్టూడెంట్స్‌ లక్ష్యం ‘స్టార్టప్‌ డైరీ’తో ఆచార్య.నెట్‌ ఫౌండర్‌ రాజేశ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘ఇక్కడ ట్యూషన్స్‌ చెప్పబడును’ అని ఇంటి గేటుకు బోర్డులు చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడీ బోర్డులు ఆచార్య.నెట్‌లోకి ఆన్‌లైన్‌లోకి ఎక్కేశాయి. విజయవాడకు చెందిన ఈ స్టార్టప్‌ ప్రత్యేకత ఏంటంటే? ఓలా, ఉబర్‌లల్లో ఎలాగైతే మనకు దగ్గర్లోని క్యాబ్స్‌

Most from this category