News


ఎడెల్‌వీజ్‌, పిరమల్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌.. ఏం సంకేతం?

Thursday 27th June 2019
Markets_main1561575522.png-26599

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజాగా ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దీర్ఘకాలిక రేటింగ్‌లను (డౌన్‌గ్రేడ్‌) తగ్గించింది. ఈ సంస్థల హోల్‌సేల్‌ రియల్‌ ఎస్టేట్‌ రుణాల పుస్తకంలో అధిక డిఫాల్ట్‌లకు అవకాశం ఉండడంతో ఈ పనిచేసింది. ఆర్థిక రంగ మందగమనం కూడా ఈ పరిస్థితులకు కారణం. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ హోల్‌సేల్‌ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు రెండు విధాలుగా కష్టాలు వచ్చిపడినట్టు అయింది. ఒకవైపు తమ రుణ ఆస్తుల్లో అధిక ఎన్‌పీఏలు, మరోవైపు తాము తీసుకొచ్చిన రుణలను రీఫైనాన్స్‌ చేసుకోవడం కష్టతరం కావడాన్ని అవి ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. 

 

గత 10 నెలలుగా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ప్రతికూలతలను చవిచూస్తూనే ఉన్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ రుణాలకు చెల్లింపుల్లో విఫలం కావడం, ఆ తర్వాత దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ అడాగ్‌ కంపెనీలు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు వీటిల్లో ఎక్స్‌పోజర్‌ కారణంగా ఆయా స్టాక్స్‌ తీవ్రంగా నష్టపోయాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌తో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తీవ్ర లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశ రియల్టీ మార్కెట్‌ తగ్గుముఖం పట్టడం కూడా ఈ సంస్థలకు సమస్యలను తెచ్చిపెట్టాయి. గత కొన్ని సంవత్సరాలుగా నివాసి ఇళ్ల ప్రాజెక్టుల విభాగంలో క్షీణత నెలకొంది. నిర్మాణం పూర్తయి అమ్మకం కాకుండా మిగిలినపోయిన ఇళ్ల యూనిట్లు ఇందుకు నిదర్శనం. అలాగే, నూతన ప్రాజెక్టుల ప్రారంభం కూడా తగ్గడం, నిలిచిపోయిన ప్రాజెక్టులు ఈ రంగంలో పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. నిజానికి ఈ తాలూకూ సమస్యలు ఎన్‌బీఎఫ్‌సీ పుస్తకాల్లో ఇంకా పూర్తిగా ప్రతిఫలించాల్సి ఉంది.  

 

2018 సెప్టెంబర్‌ వరకు ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్యల్లేవు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు సైతం వివిధ పథకాల కింద ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు అందిస్తుండేవి. కానీ, ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సహకారం దాదాపుగా తగ్గిపోయింది. కేవలం కొన్నింటికే పరిమితంగా ఈ సహకారం అందుతోంది. దీంతో ఎడెల్‌వీజ్‌, పిరమల్‌ వంటి హోల్‌సేల్‌ లెండర్లకు నిధుల సమస్య కఠినంగా మారింది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నిధుల వెసులుబాటు తగ్గిపోయింది. దాంతో వాటి రుణాల వ్యయాలు పెరిగిపోయాయి. అదే సమయంలో వీటి నుంచి రుణాలు తీసుకున్న సంస్థలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. లిక్విడిటీ కఠినంగా మారిన పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్‌పీఏలు పెరగడం జరిగింది. లిక్విడిటీ, నిధుల సమీకరణ వ్యయాలను ఇన్వెస్టర్లు పరిశీలిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.You may be interested

బీఎస్‌ఈ 500లో 20 శాతం ఏడాది కనిష్టానికి..!

Thursday 27th June 2019

బెంచ్‌ మార్క్‌ సూచీలు జూన్‌లో నూతన గరిష్టాలను నమోదు చేశాయి. ఆ తర్వాత కొంత దిద్దుబాటుకు గురై మళ్లీ ఎగువవైపు ర్యాలీ మొదలు పెట్టాయి. కానీ, చాలా స్టాక్స్‌ విషయంలో పరిస్థితి మరోలా ఉంది. నిఫ్టీ-50లోనే 22 నుంచి 24 స్టాక్స్‌ వరకు 200 డీఎంఏకు దిగువన ట్రేడ్‌ అవుతుండగా, బీఎస్‌ఈ 500 స్టాక్స్‌లో సుమారు 20 శాతం స్టాక్స్‌ ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. జూన్‌ నెలలో బీఎస్‌ఈ

ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు అంతంతమాత్రమే

Wednesday 26th June 2019

స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీలు రాణించే అవకాశం పార్మారంగంలో కాంప్లెక్స్‌ జనరిక్‌ రాణించగలదు ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌కు లాభం  2020 ఆర్థిక సంవత్సరం ద్వితియార్థం కంటే ప్రథమార్ధంలోనే అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని, కానీ ఆర్థిక సంస్కరణలు దీనిని మార్చవచ్చని ప్రిన్సిపల్‌ ఏఎమ్‌సీ సీఐఓ రజత్‌ జైన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. పూర్తి ఇంటర్యూ ఆయన మాటల్లోనే.. బడ్జెట్‌ పాలసీపై ఇన్వెస్టర్ల దృష్ఠి..     ఈ ఏడాది

Most from this category