News


వెలుగులోకి మాల్యా కొత్త షెల్‌ కంపెనీలు

Tuesday 30th July 2019
news_main1564466119.png-27406

  • అక్రమంగా నిధుల మళ్లింపు కేసులో ఈడీ గుర్తింపు
  • అనుచరుడి ఇంట్లో సోదాలు

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్‌ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్‌) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్‌ కంపెనీలను(యునైటెడ్‌ బ్రాండింగ్‌ వరల్డ్‌వైడ్‌ ఇతరత్రా) గుర్తించింది. దీని ఆధారంగా బెంగళూరుకు చెందిన వి.శశికాంత్‌, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ గతవారం సోదాలు నిర్వహించింది. తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్‌(ఎఫ్‌ఈఓ) చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో దాదాపు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన మల్యాపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటన్‌ పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాగా, మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద మల్యాపై దాఖలైన క్రిమినల్‌ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఎఫ్‌ఈఓ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసింది. శశికాంత్‌ అనే వ్యక్తి మాల్యాకు అత్యంత ఆప్తుడని ఈడీ వర్గాలు తెలిపాయి. 2017, ఫిబ్రవరి వరకూ మాల్యా గ్రూపులో ఉద్యోగిగా పనిచేసిన శశింకాంత్‌.. మలా‍్యకు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా దాదాపు తొమ్మిదేళ్లపాటు వ్యవహరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శశికాం‍త్‌ నుం‍చి కీలకమైన పత్రాలు, ఈమెయిల్‌, వాట్సాప్‌ సంభాషణలను కూడా తాజా సోదాల్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉంటే, తమ కంపెనీలు, కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవాడాన్ని సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 2న విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీం కోర్టు అంగీకరించింది.You may be interested

హైదరాబాద్‌లో తగ్గిన గృహాల విక్రయాలు

Tuesday 30th July 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో అమ్మకాల్లో 6 శాతం గ్రోత్‌ కనిపించిందని ప్రాప్‌ఈక్విటీ సర్వే తెలిపింది. అయితే ఇదే సమయంలో కొత్త గృహాల సప్లయిలో మాత్రం 11 శాతం క్షీణత నమోదైందని సర్వే పేర్కొంది. 5,89,503 గృహాల ఇన్వెంటరీ... గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరు, థానే, చెన్నై నగరాల్లో ఏప్రిల్‌ –

ఇదంతా ప్రభుత్వం నిర్వాకమే..

Tuesday 30th July 2019

డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి వాటికి ఊతమిచ్చేందుకు కేంద్రం చర్యలేమీ తీసుకోవడం లేదు  బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు, డిమాండ్‌కి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఏ విధంగానూ ప్రయత్నించడం లేదని ఆక్షేపించారు. "ప్రభుత్వం చెప్పినా చెప్పకున్నా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు గణాంకాలు

Most from this category