News


స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తుల జప్తు

Thursday 27th June 2019
news_main1561621777.png-26623

న్యూఢిల్లీ: బ్యాంకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న గుజరాత్ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 9,778 కోట్లు ఉంటుంది. జప్తు చేసిన వాటిలో ఓడలు, బిజినెస్ జెట్‌ విమానం, నైజీరియాలోని ఆయిల్ రిగ్గులు, లండన్‌లోని విలాసవంతమైన ఫ్లాట్ మొదలైనవి ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వీటి జప్తునకు సంబంధించి ప్రొవిజనల్‌ ఆర్డరు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. కంపెనీ ప్రధాన ప్రమోటర్లయిన నితిన్ సందేశారా తదితరులు దాదాపు రూ. 8,100 కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 



You may be interested

కొన్ని మరీ చౌక.. మరికొన్ని బాగా ఖరీదు!

Thursday 27th June 2019

నిఫ్టీ స్టాక్స్‌ వాల్యూషన్లలో భారీ వ్యత్యాసాలు నిఫ్టీలో భాగమైన స్టాక్స్‌ వాల్యూషన్లలో, ప్రదర్శనలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని కొన్ని స్టాకులు భారీ ప్రీమియంలతో ట్రేడవుతుంటే, మరికొన్ని తమ దీర్ఘకాలిక సరాసరి కన్నా డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. ప్రస్తుత డౌన్‌సైడ్‌ రిస్కుల కారణంగా ఇండెక్స్‌ స్థాయిలో వాల్యూషన్‌ రీరేటింగ్‌కు చాలా స్వల్ప అవకాశాలున్నాయని తెలిపింది. స్టాకుల్లో వాల్యూషన్ల వ్యత్యాసాలు సూచీల్లో సందిగ్ధతకు కారణమవుతున్నాయని పేర్కొంది.  డిస్కౌంట్‌లో ఉన్న స్టాకులు: ఐషర్‌

ఆశాజనకంగా భారత కంపెనీల వృద్ధి రేటు

Thursday 27th June 2019

- హెచ్‌ఎస్‌బీసీ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: అభివృద్దిపై ఆశాజనకంగా ఉన్న కంపెనీల జాబితా పరంగా భారత్‌ రెండవ స్థానంలో ఉంది. ప్రతి పది కంపెనీల్లోని తొమ్మిది కంపెనీలు అత్యంత ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ తాజా నివేదికలో పేర్కొంది. ఈ అంశంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానంలో భారత్‌ ఉన్నట్లు తెలిపింది. గతేడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోయి 6.8

Most from this category